Telugu One ప్రొడక్షన్స్‌ ‘రాజధాని ఫైల్స్‌’ ట్రైలర్‌ February 5న విడుదల

శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై భాను దర్శకత్వంలో కంఠంనేని రవిశంకర్‌ నిర్మించిన చిత్రం ‘రాజధాని ఫైల్స్‌’. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంతో అఖిలన్‌, వీణ నటులుగా పరిచయం అవుతున్నారు.ఈ చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ని అనౌన్స్‌ చేశారు మేకర్స్‌. ఫిబ్రవరి 5న ట్రైలర్‌ ని లాంచ్‌ చేస్తున్నారు. ‘’బిడ్డను పొదిగే గర్భంలో గొడ్దలి దించిన కర్కశత్వం’ అనే వాక్యంతో డిజైన్‌ చేసిన ట్రైలర్‌ అనౌన్స్‌ మెంట్‌ పోస్టర్‌ పవర్‌ ఫుల్‌ గా వుంది. పోస్టర్‌ లో వేలాది మంది రైతులు అందోళన చేస్తూ కనిపించడం మనసుల్ని కదిలిస్తుంది.ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రమేష్‌ డీవోపీ పని చేస్తుండగా,  కోటగిరి వెంకటేశ్వర్‌ రావు ఎడిటర్‌. గాంధీ ఆర్ట్‌ డైరెక్టర్‌ గా పని చేస్తుండగా అనిల్‌ అచ్చుగట్ల డైలాగ్స్‌ అందిస్తున్నారు.నటీనటులు: అఖిలన్‌, వీణ, వినోద్‌ కుమార్‌, వాణీ విశ్వనాథ్‌, పవన్‌, షణ్ముఖ్‌ , విశాల్‌, మధు, అజయరత్నం, అంకిత ఠాకూర్‌, అమృత చౌదరి తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....