కార్యనిర్వాహక అధ్యక్షునిగా గడ్డం సత్యనారాయణ
అధ్యక్షుడు ఎన్ శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేత
హైదరాబాద్ ఏప్రిల్ 10 (ఇయ్యాల తెలంగాణ) :తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షునిగా గడ్డం సత్యనారాయణ నియమితులయ్యారు ఈ మేరకు అధ్యక్షుడు ఎన్ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ తీర్మానం చేసి అందరి ఆమోదం మేరకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గతంలో 25 సంవత్సరాలు గ్యాస్ ఏజెన్సీలో పనిచేసిన అనుభవం ఉన్న నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ కుకింగ్ గ్యాస్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ను వర్కర్ కోసం తన వంతు పోరాటం చేస్తాడని కార్మికుల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి అని ఆయన కొనియాడారు. కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియామక పత్రం అందుకున్న గడ్డం సత్యనారాయణ మాట్లాడుతూ నాకు ఈ బాధ్యతలు ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ గౌడ్ గారికి గౌరవ సలహాదారులు చెమ్మకూర రాజు గారికి ఉపాధ్యక్షులు పి నర్సింగ్ రావు గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి అశోక్ కుమార్ గారు ఉపాధ్యక్షులు మమ్మద్ యునోస్ గారికి డెలివరీ బాయ్స్ అందరికి కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో శ్రీ సాయి ఏజెన్సీలో డెలివరీ బాయ్ గా శ్రీనివాస్ ఎంటర్ప్రైజెస్ లో టెక్నికల్ మెకానిక్ గా కమర్షియల్ డెలివరీ బాయ్‌గా అన్ని విధాల పని చేసిన అనుభవం ఉన్నదని, నేడు గ్యాస్ ఏజెన్సీల డీలర్లు కార్మికులకు, డెలివరీ బాయ్ లకు వారి హక్కులన్నీ నేల రాసి ప్రతి విషయంలోనూ డెలివరీ బాయ్స్ కు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా ఒక డెలివరీ బాయ్ కి ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేవని కమిషన్ చాలా తక్కువ ఇస్తారని కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి సిలిండర్ కు 75 రూపాయలు కమిషన్ రాగా ఇక్కడ డీలర్లు మటుకు 12 రూపాయలు పది రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్నారు. డెలివరీ బాయ్ జీవన విధానంపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారని, గతంలో ఒక్క డెలివరీ బాయ్ కి డీలర్ నుండి ఆటో ఇవ్వబడును డీజిల్, పెట్రోలు ఇవ్వబడును మరి జీతం కూడా ఇవ్వబడుతుంది కానీ ఇప్పుడు అతి తక్కువ కమిషన్ ఇచ్చి డెలివరీ చేస్తే చేయి లేకుంటే లేదని కొందరు డీలర్ బాయ్ లను బెదిరిస్తున్నారు ఇది సరైన విధానం కాదు కార్మిక చట్టానికి విరుద్ధంగా వివరిస్తున్నారు ఈరోజు డెలివరీ బాయ్స్ విపరీతమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలన్నీ కూడా డీలర్షిస్తున్నారు 100% ఓటిపి కావాలని డెలివరీ బాయ్స్ ను వేధిస్తున్నారు . వాస్తవానికి 85% ఉండాలని పెట్రోలియం కంపెనీ కూడా డీలర్లకు తెలియజేస్తున్న డీలర్లు మటుకు డీలర్ బాయ్స్ ను వేధిస్తున్నారు . ఇది సరైన విధానం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని అన్నారు. ఇక ముందు ఏ డెలివరీ బాయ్ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా వారి కోసం నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.
