హైదరాబాద్,
నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్,మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు,మర్రి జనార్దన్ రెడ్డి,హర్షవర్ధన్ రెడ్డి తదితరులు అచ్చంపేటలో కాంగ్రెస్ గుండాలు బీఆర్ఎస్ నాయకులపై చేసిన దాడులపై రాష్ట్ర డీజీపీ కి ఫిర్యాదు చేసారు.
డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గంలో రాజకీయ కక్షతో బీఆర్ఎస్ కౌన్సిలర్ సుంకరి నిర్మల బాలరాజు ఇంటిపై కాంగ్రెస్ గుండాలు మరణాయుధాలతో దాడి చేసి, హత్యాయత్నం చేసినా నిందితులను పోలీసులు అరెస్టు చేయడంలో విఫలమయ్యారని అన్నారు.
వంగూరు మండలంలో పోలింగ్ రోజు బిఆరెస్ నాయకులపై కాంగ్రెస్ గూండాలు దాడులు చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై విచారణ జరిపి,చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అచ్చంపేటలో అధికార పార్టీ నాయకులు గుండాల్లా ప్రవర్తిస్తూ, బీఆర్ఎస్ నాయకులపై వరుస దాడులకు పాల్పడ్డారు. కాంగ్రెస్ గుండాలతో బీఆర్ఎస్ నేతలకు ప్రాణహాని ఉందని, వారికి రక్షణ కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా దారుణంగా ఉన్నాయి. చాలా ప్రాంతాలలో అధికార పార్టీ గుండాలు విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నారు. మళ్ళీ నైమ్ ముఠాలు బయటికొస్తున్నారు. స్థానిక వంశీకృష్ణ ఆధీనంలో ఆశ్రయం పొందుతున్నారు. జూపల్లి కృష్ణారావు ప్రోద్బలంతో నగర్ కర్నూల్ లో బిఆరెస్ నాయకులపై దాడులు చేస్తున్నారు. బిఆరెస్ నాయకులు పిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోకుండా,అధికార పార్టీ నేతలు పిర్యాదు చేయగానే తీసుకుంటున్నారు. నగర్ కర్నూల్ లో పలు ప్రాంతాల్లో పికెటింగ్ వేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఇలాంటి అరాచకాలు జరగడం చాలా గోరం. కాంగ్రెస్ వచ్చి 6నెలలు కాకముందే అరాచక శక్తులు మళ్ళీ వారి కార్యక్రమాలు చేపట్టారు. ఇలాంటి గుండాలపై రాష్ట్ర డీజీపీ చర్యలు తీసుకోకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారె అవకాశం ఉందని అనమ్నారు.
