టీజర్‌ లాంచ్‌ Event లో Hero సూర్య సేతుపతి

ఫీనిక్స్‌’తో తెలుగులో పరిచయం కావడం ఆనందంగా వుంది. హై యాక్షన్‌ తో పాటు మంచి ఎమోషన్‌ వున్న సినిమా ఇది. అందరూ సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నాను: టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ లో హీరో సూర్య సేతుపతి

మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ఫీనిక్స్‌. ప్రముఖ స్టంట్‌ మాస్టర్‌ అనల్‌ అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యాక్షన్‌తో పాటు హై ఎమోషన్స్‌ తో వుండబోతుంది. ఏకే బ్రేవ్‌మ్యాన్‌ పిక్చర్స్‌  బ్యానర్‌ పై రాజలక్ష్మి ‘అన్ల్‌’ అరసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇపప్టికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, సాంగ్స్‌ ని మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా  మేకర్స్‌ ఈ సినిమా టీజర్‌ ని లాంచ్‌ చేశారు.  

టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ లో హీరో సూర్య సేతుపతి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఫీనిక్స్‌ తెలుగులో రిలీజ్‌ కాబోతుంది. తప్పకుండా విూ అందరికీ నచ్చుతుంది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌ అనల్‌ అరసు  గారికి, నిర్మాతలకి ధన్యవాదాలు. ఈ సినిమాని తెలుగులోకి తీసుకొస్తున్న ధనుంజయన్‌ గారికి థాంక్యూ సో మచ్‌. వర్ష చాలా అద్భుతంగా పెర్ఫామ్‌ చేసింది. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా సపోర్ట్‌ చేశారు. అనల్‌ అరసు గారు ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేశారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని భావిస్తున్నాను. ఈ సినిమా కోసం దాదాపు ఏడాదిన్నర పాటు ట్రైనింగ్‌ తీసుకున్నాను. యాక్షన్‌ సీక్వెన్స్‌ ని ముందే ప్రాక్టీస్‌ చేయించారు. ఈ సినిమాలో యాక్షన్‌ తో పాటు అద్భుతమైన ఎమోషన్‌ ఉంది. త్వరలోనే సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుంది. తప్పకుండా అందరూ సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నాను’అన్నారు.

డైరెక్టర్‌ అనల్‌ అరసు మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా నా భార్య కి ధన్యవాదాలు చెబుతున్నాను. తను లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. నేను దర్శకుడు కావాలనుకున్నప్పుడు ముందు తనకే చెప్పాను. తను నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచింది. తనే సినిమాని నిర్మించాలని భావించింది. అలా ఈ సినిమా స్టార్ట్‌ అయింది. ఫైట్‌ మాస్టర్‌ గా పెద్ద పెద్ద సినిమాలుచేశాను. అయితే యాక్షన్‌ లో కూడా ఒక కొత్తదనం ఉండాలని ప్రయత్నంతో ఈ ఫినిక్స్‌ సినిమా చేయడం జరిగింది. సూర్యని ఎందుకు తీసుకున్నానో విూరు సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. తనకి ముందుగానే ట్రైనింగ్‌ ఇచ్చాను. సూర్య చాలా హార్డ్‌ వర్కర్‌. తనకి చాలా బ్రైట్‌ ఫ్యూచర్‌ ఉంటుంది. ఈ సినిమాల్లో పనిచేసిన అందరూ కూడా చాలా సపోర్ట్‌ చేశారు. ఇందులో యాక్షన్‌ తో పాటు మంచి ఎమోషన్‌ ఉంది.  త్వరలోనే ఈ సినిమా విూ ముందుకు వస్తుంది. తప్పకుండా సినిమాని సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నాను

హీరోయిన్‌ వర్ష మాట్లాడుతూ..  అందరికి నమస్కారం. ఇది నా ఫస్ట్‌ సినిమా. తెలుగులో రిలీజ్‌ కావడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్యూ. ఇది చాలా స్పెషల్‌ ఫిలిం. యాక్షన్‌ చాలా అద్భుతంగా ఉంటుంది. సూర్య సేతుపతి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా ఈ సినిమా విూకు నచ్చుతుంది. త్వరలోనే రాబోతుంది.  అందరూ ఈ సినిమాను సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నాను’అన్నారు.

రైటర్‌ భాష్యశ్రీ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఫీనిక్స్‌ అనే టైటిల్‌ ఈ సినిమాకి యాప్ట్‌. అనల్‌ అరసు గారు  సినిమాని అద్భుతంగా తీశారు. ప్రతి యాక్షన్స్‌ సీక్వెన్స్‌ లో ఒక తాండవంలా ఉంటుంది. సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. సూర్య అద్భుతంగా యాక్షన్‌ చేశాడు. చాలా పెద్ద హీరో అవుతాడు. త్వరలోనే సినిమా విూ ముందుకు వస్తుంది. ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను.

ప్రొడ్యూసర్‌ ధనంజయన్‌ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. అనల్‌ అరసు యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ గా అద్భుతమైన సినిమాలు చేశారు. పెద్ద పెద్ద హీరోలు సినిమాలకు పని చేశారు. ఆయన ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాజ్యలక్ష్మి గారు  సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చూశాను. చాలా పెద్ద ఫిలిం లాగా అనిపించింది. ఒక డెబ్యు యాక్టర్‌ తో ఇలాంటి బిగ్‌ స్కేల్‌ సినిమా చేయడం చాలా అరుదు. సూర్య ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాడు. అద్భుతమైన యాక్షన్‌ చేశాడు. ఎమోషనల్‌ అండ్‌ హై యాక్షన్‌ స్టోరీ ఇది. తప్పకుండా ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌ ని ఎంటర్టైన్‌ చేస్తుంది’అన్నారు.

ప్రొడ్యూసర్‌ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఫీనిక్స్‌ వండర్ఫుల్‌ సినిమా. విజయ్‌ సేతుపతి గారి అబ్బాయి ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. అలాగే నా హస్బెండ్‌ డైరెక్టర్‌ గా చేస్తున్న ఫస్ట్‌ మూవీ ఇది.  విూరందరూ సపోర్ట్‌ చేస్తారని కోరుకుంటున్నాను’అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....