TEACHERS కావాలంటూ రోడ్డెక్కిన విద్యార్థులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులై 10 (ఇయ్యాల తెలంగాణ );భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల గుమ్మడవల్లి ప్రభుత్వ పాఠశాలలో రెండు వందల మంది విద్యార్థులకు కేవలం ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు ఉండటంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఈ విద్యాసంవత్సరం వృధా చేయద్దంటూ ఫ్లగ్‌ కార్డులు పట్టుకుని రోడ్డుపై భైఠాయించారు.మొత్తం పిల్లలు రెండొందలు వరకూ ఉండగా 36 మంది పదవతరగతి విద్యార్థులున్నారు.తమ పాఠశాలకు వెంటనే ఉపాధ్యాయులను రిక్యూట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.తమ పిల్లలు చేస్తున్న నిరసనకు తల్లితండ్రులు కూడా మద్దతుగా రోడ్డుపైకి వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ వెంటనే స్పందించి గుమ్మడవల్లి పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....