తమిళ Star విజయ్‌ Party కి విజిల్ గుర్తును కేటాయించిన EC

న్యూఢిల్లీ , జనవరి 22 (ఇయ్యాల తెలంగాణ) : తమిళ ఫిల్మ్ స్టార్ విజయ్‌కి చెందిన తమిళగ వెట్రి ఖజగం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం విజిల్ గుర్తును కేటాయించింది. తమిళనాడులో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 11వ తేదీన తమ పార్టీకి గుర్తు ఇవ్వాలని కోరుతూ విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. 1968 నాటి ఎలక్షన్ సింబల్స్ ప్రచారం తమకు గుర్తు కేటాయించమని అభ్యర్థించింది. మొత్తం ఏడు సింబల్స్‌కు చెందిన లిస్టును ఆ పార్టీ సబ్మిట్ చేసింది. అయితే ఆ గుర్తులన్నీ ఇప్పటికే ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. స్వంతంగా క్రియేట్ చేసిన మూడు మరో సింబల్స్‌ను కూడా ఆ పార్టీ సమర్పించింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....