మధ్యం సేవించి వాహనం నడిపితే 10,000 రూపాయలు
జైలు శిక్ష సిద్దిపేట జిల్లాలో తొలిసారిగా కఠిన చర్యలు అమలు
ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్
సిద్దిపేట, అక్టోబర్ 29 (ఇయ్యాల తెలంగాణ) : పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు సిద్దిపేట్ నగరంలో రోడ్డు భద్రత కోసం మరియు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు అమలు చేస్తోంది. మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనల ప్రకారం త్రాగి వాహనం నడపడం, తీవ్ర నేరంగా పరిగణించ బడుతుంది. ఈ నేరం గుర్తించిన వారిపై కింది శిక్షలు విధించబడతాయి:మోటార్ వెహికల్ యాక్ట్ 1988, ప్రకారం`త్రాగి వాహనం నడిపితే శిక్షలు.సెక్షన్ 185` బ్లడ్ ఆల్కహాల్ లిమిట్: 35 ఎంజి100 ఎంఎల్ కంటే ఎక్కువగా ఉంటే,మొదటి సారిశిక్ష. 10,000 జైలు: 6 నెలల వరకు లైసెన్స్ సస్పెన్షన్: 6 నెలలు రెండవసారి శిక్ష జరిమానా: రూ.15,000 జైలు:2 సంవత్సరాల వరకు లైసెన్స్ రద్దు? 2 సంవత్సరాల వరకు లేదా శాశ్వతంగాఅదనపు శిక్షలు మోటార్ వాహనం యాక్ట్ సెక్షన్ 185G రాష్ట్ర నిబంధనలు ప్రకారం, వాహనం సీజ్:రెండోసారి పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయవచ్చు. రిపీట్ ఆఫెండర్ అయితే లైసెన్స్ పూర్తిగా రద్దు చేయబడుతుంది.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు:
సిద్దిపేట జిల్లాలో లో వివిధ రోడ్ల వద్ద, వివిధ సమయాల్లో రాత్రి, ఉదయం, సాయంత్రం ఏ సమయంలోనైనా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబడుతున్నాయి. ఎవరూ ఈ తనిఖీల నుంచి తప్పించుకోలేరు. అదనంగా, స్పెషల్ డ్రైవ్ లు, కూడా నిర్వహించ బడుతున్నాయి. ఎవరినీ ఉపేక్షించేది లేదు: త్రాగి వాహనం నడిపితే ఎంతటి వ్యక్తి అయినా, సామాన్యుడు, ప్రముఖుడు, అధికారి లేదా ఇతరులు,ఎవరినీ ఉపేక్షించేది లేదు. చట్టం అందరి ముందూ సమానం. నగరంలోని వాహనదారు ఆ అందరూ ఈ నిబంధనలను గౌరవించి, తమ బాధ్యతను నిర్వర్తించాలి. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల స్వయంగా మరియు ఇతరుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. కాబట్టి, మద్యం తాగి వాహనం నడపకండి. ట్రాఫిక్ పోలీసులు రోజువారీగా మరియు స్పెషల్ డ్రైవ్‌ల ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ఈ నియమాలను ఉల్లంఘిస్తే, కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు.విూ భద్రత`మా బాధ్యత, ఎల్లవేళలా విూ సేవలో సిద్దిపేట జిల్లా పోలీసుల. ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ అన్నారు.