
కోరుట్ల : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైజింగ్ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు బుధవారం కోరుట్ల మునిసిపాలిటీ లోనీ స్వశక్తి మహిళా భవన్ లో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మేళా నిర్వహించారు.మెప్మా ఆర్పీలు, మహిళా సంఘల సభ్యులు తయారు చేసిన తినుబండారాలు,ఇతర పదార్థాలను స్టాల్స్ లా ఏర్పాటు చేసి విక్రయించారు. పలు వార్డులలో తడి చెత్త పొడి చెత్త హానికార చెత్త,ప్లాస్టిక్ నిషేధం గురించి మహిళా సంఘాల సభ్యులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, సానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్ అశోక్, మెప్మా టి.ఎం.సి శ్రీరామ్ గౌడ్ ,సి.ఓ.లు సంధ్య, గంగారాణి మెప్మా సిబ్బంది,పట్టణ ప్రజలు పాల్గొన్నారు.