Star ప్రొడ్యూసర్‌ Dil Raju చేతుల విూదుగా చైతన్య రావ్‌ ‘‘

చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘‘షరతులు వర్తిస్తాయి’’. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్‌ లైట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్‌ కుమార్‌ గుండా, డాక్టర్‌ కృష్ణకాంత్‌ చిత్తజల్లు నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘‘షరతులు వర్తిస్తాయి’’ సినిమా త్వరలో థియేట్రికల్‌ రిలీజ్‌ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు ముఖ్య అతిథిగా హైదరాబాద్‌ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వేణు ఊడుగుల, మామిడి హరికృష్ణ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు మాట్లాడుతూ ` మామిడి హరికృష్ణ గారితో నాకు బలగం సినిమా చేసిన టైమ్‌ లో పరిచయం ఏర్పడిరది. ఒకసారి రవీంద్రభారతికి తీసుకెళ్లి వాళ్లు చేసే ట్రైనింగ్‌ కార్యక్రమాలు చూపించారు. సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఔత్సాహికులకు వాళ్లు కల్చరల్‌ డిపార్ట్‌ మెంట్‌ ద్వారా ఇస్తున్న ట్రైనింగ్‌, ఇతర కార్యక్రమాల గురించి తెలిసి హ్యాపీగా ఫీలయ్యా. మేము మా దగ్గరకు వచ్చే రైటర్స్‌, డైరెక్టర్స్‌ కు అవకాశాలు ఇస్తుంటాం. అయితే వీళ్లు మంచి ట్రైనింగ్‌ ఇచ్చే కార్యక్రమాలు చేపట్టారు. ఒక మంచి కాన్సెప్ట్‌ తీసుకుని ‘‘షరతులు వర్తిసాయి’’ సినిమాను రూపొందించారు. సాంగ్‌, టీజర్‌ చూశాను. బాగున్నాయి. బలగం కంటే ఎక్కువగా  తెలంగాణ నేటివ్‌ తో తెరకెక్కించారు. ఇదొక మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నా. మూవీ టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. అన్నారు.

మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ` ‘‘షరతులు వర్తిస్తాయి’’ టీజర్‌ లాంఛ్‌ కు వచ్చిన దిల్‌ రాజు గారికి థ్యాంక్స్‌. మనం సాధించిన దాని నుంచి సమాజానికి తిరిగి ఏదైనా ఇవ్వాలని కోరుకునే మంచి వ్యక్తులు నాగార్జున సామల, శ్రీష్‌ కుమార్‌ గార్లు. వాళ్లు తమ ఫ్రెండ్‌ డా.కృష్ణకాంత్‌ చిత్తజల్లు గారితో కలిసి నిర్మించిన సినిమా ఇది. ఈ ముగ్గురు లేకుంటే ఈ సినిమా ఉండేది కాదు. సహజమైన కథా కథనాలతో కొంత సినిమాటిక్‌ లిబర్టీ తీసుకుని ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలతో రూపొందిన సినిమా ఇది. దర్శకుడు కుమారస్వామి మంచి రైటర్‌. అతను సినిమా  చేయాలనే కలతో గోదావరి ఖని ప్రాంతం నుంచి వచ్చాను. ఇవాళ ఆ కల నెరవేర్చుకున్నాడు. పాత్రల్లో జీవించే అతి కొద్ది మంది నటుల్లో చైతన్య రావ్‌ ఒకరు. ఆయన 30 వెడ్స్‌ 21 నుంచి కీడా కోలా వరకు డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌ చేస్తూ నటుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. అలాగే హీరోయిన్‌ భూమి శెట్టికి కూడా ఈ సినిమాతో మంచి గుర్తింపు దక్కుతుంది. అన్నారు.

దర్శకుడు కుమారస్వామి మాట్లాడుతూ ` మా ‘‘షరతులు వర్తిస్తాయి’’ సినిమా ఫస్ట్‌ లుక్‌ లాంఛ్‌ చేసిన త్రివిక్రమ్‌ గారికి,  సాంగ్‌ రిలీజ్‌ చేసిన శేఖర్‌ కమ్ముల గారికి, ఇప్పుడు టీజర్‌ విడుదల చేసిన దిల్‌ రాజు గారికి, మాకు సపోర్ట్‌ చేస్తున్న మధుర శ్రీధర్‌ గారికి  థ్యాంక్స్‌. ప్రేక్షకులకు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా ఉండదు. మంచి సినిమా అయితే తప్పకుండా చూస్తారు. మా సినిమాలో కంటెంట్‌ ఉంది. ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాను. ఈ మూవీ చేసే క్రమంలో హీరో చైతన్య, హీరోయిన్‌ భూమి ఎంతో సపోర్ట్‌ ఇచ్చారు. అన్నారు.

హీరోయిన్‌ భూమి శెట్టి మాట్లాడుతూ ` నేను కన్నడ అమ్మాయిని. ఈ సినిమా కోసం డైరెక్టర్‌ కుమారస్వామి కాల్‌ చేసినప్పుడు ఫ్రాంక్‌ కాల్‌ అనుకున్నా. ఈ సినిమాలో అవకాశం అనుకోకుండా వచ్చింది. ఇందులో తెలుగు మాత్రమే కాదు నేటివ్‌ తెలంగాణ యాసలో మాట్లాడాల్సి వచ్చింది. కరీంనగర్‌ వెళ్లి అక్కడ షూట్‌ టైమ్‌ లో తెలంగాణ యాస నేర్చుకుని నటించాను. ‘‘షరతులు వర్తిస్తాయి’’ ఒక మంచి మూవీ. విూ ముందుకు త్వరలో వస్తుంది. విూ సపోర్ట్‌ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో చైతన్య రావ్‌ మాట్లాడుతూ `  ఒక మంచి చిన్న సినిమా థియేటర్స్‌ దాకా రావడం కష్టంగా ఉంటోంది. అయితే త్రివిక్రమ్‌, శేఖర్‌ కమ్ముల, దిల్‌ రాజు, వేణు ఊడుగుల వంటి మంచి పర్సన్స్‌ ద్వారా మాకు సపోర్ట్‌ లభిస్తోంది. నేను కరీంనగర్‌ వాసిని. పరిశ్రమలో నటుడిగా ఎదిగి మళ్లీ కరీంనగర్‌ వెళ్లి సినిమా షూటింగ్‌ చేయడం ఒక అఛీవ్‌ మెంట్‌ లా అనిపించింది. ‘‘షరతులు వర్తిస్తాయి’’ సినిమాతో డైరెక్టర్‌ కుమారస్వామి తనదైన ముద్ర వేసుకుంటారు. ఒకు సున్నితమైన కథకు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ చేర్చుతూ అందరికీ నచ్చేలా సినిమా రూపొందించడం ఈజీ కాదు . ఈ సినిమా తర్వాత కుమారస్వామి మరిన్ని మంచి మూవీస్‌ చేస్తాడు. త్వరలోనే ‘‘షరతులు వర్తిస్తాయి’’ సినిమా థియేటర్స్‌ లోకి వస్తుంది. విూరంతా ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటి పద్మావతి మాట్లాడుతూ ` ఈ సినిమాలో నేను హీరో మదర్‌ క్యారెక్టర్‌ చేశాను. చాలా మంచి క్యారెక్టర్‌ ఇది. ఈ క్యారెక్టర్‌ ప్రేక్షకులు బాగా రీచ్‌ అవుతుందని షూటింగ్‌ టైమ్‌ లోనే నమ్మకం కలిగింది. చైతన్య రావ్‌ చేస్తున్న మరో సినిమాలో కూడా నటిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌ గారికి థ్యాంక్స్‌. అన్నారు

డైలాగ్‌, లిరిక్‌ రైటర్‌ పెద్దింటి అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ ` డైరెక్టర్‌ కుమారస్వామి ఫస్ట్‌ నా దగ్గరకు మాటలు రాయమని వచ్చాడు. నేను పాటలు రాస్తుంటా అని చెబితే నువ్వు రాయగలవు అన్నా అన్నాడు. ఆ తర్వాత ఇందులో నాతో ఓ పెండ్లి పాట రాయించాడు. కొన్ని రోజులకు ఈ సినిమాలో ఓ క్యారెక్టర్‌ చేయాలని అడిగాడు. ఆ క్యారెక్టర్‌ ఏదో చిన్నది అనుకున్నా..ఈ సినిమాలో కీలకమైన పాత్ర ఇచ్చాడు. అది నా రియల్‌ లైఫ్‌ కు భిన్నమైన క్యారెక్టర్‌. ‘‘షరతులు వర్తిస్తాయి’’ సినిమా దర్శకుడిగా కుమారస్వామికి గొప్ప అరంగేట్రం అవుతుంది. ఇదొక మంచి సినిమాగా పేరు తెచ్చుకుంటుంది. అన్నారు.

ప్రొడ్యూసర్‌ డా.కృష్ణకాంత్‌ చిత్తజల్లు మాట్లాడుతూ ` చాణక్యుడు, చంద్రగుప్తుడు కలిస్తే ఎలా ఉంటారో ఈ సినిమాలో మా హీరో క్యారెక్టర్‌ అలా ఉంటుంది. పెళ్లికి ముందు ప్రేయసితో సరదాగా ఉండటం, పెళ్లయ్యాక ఫ్యామిలీగా బాధ్యతలు నెరవేరుస్తూ…సొసైటీ లోని ఒక సమస్యను పరిష్కరించేందుకు ఎలా ముందుకు వచ్చాడనేది ఈ సినిమా కథ. ప్రతి పాత్రను అందంగా తీర్చిదిద్దారు మా దర్శకుడు కుమారస్వామి. సినిమా ఎక్కడా బోర్‌ కొట్టకుండా ఒక మంచి సినిమా చూశామనే ఫీల్‌ కలిగిస్తుంది. అన్నారు

డైరెక్టర్‌ వేణు ఊడుగుల మాట్లాడుతూ ` డైరెక్టర్‌ కుమారస్వామి నాతో దాదాపు పదేళ్లుగా ట్రావెల్‌ చేస్తున్నాడు. అతను చాలా టాలెంట్‌, మంచితనం ఉన్న వ్యక్తి. కుమారస్వామి కష్టపడి ఈ మూవీ రూపొందించాడు. రెండేళ్ల క్రితమే ఈ స్క్రిప్ట్‌ చదివాను. ఒక గొప్ప అనుభూతి కలిగించింది. ఈ కథలో దర్శకుడు క్రియేట్‌ చేసిన క్యారెక్టర్స్‌, చెప్పాలనుకున్న అంశాలు బాగుంటాయి. అవన్నీ కమర్షియల్‌ పద్ధతిలోనే సినిమా చూసేవాళ్లకు నచ్చేలా రూపొందించాడు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, వెనకబడిన ప్రజల జీవితాల్లోని లైఫ్‌ స్టైల్‌, ఎదగాలనే తపనతో స్థానికత ఉట్టిపడేలా సినిమా తెరకెక్కించాడు. ‘‘షరతులు వర్తిస్తాయి’’ సమాజంలో ఒక చర్చకు దారితీసే సినిమా అవుతుంది. దర్శకుడిగా కుమారస్వామి మంచి పేరు తెచ్చుకుంటాడు. అన్నారు.

నటీనటులు ` చైతన్య రావ్‌, భూమి శెట్టి, నంద కిషోర్‌, సంతోష్‌ యాదవ్‌, దేవరాజ్‌ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, శివ కల్యాణ్‌, మల్లేష్‌ బలాస్త్‌, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్‌ కుమార్‌, సుజాత తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....