శ్రీ సరస్వతి విద్యా మందిర్ పూర్వ విద్యార్థుల, హితైషుల మహా సమ్మేళనము

హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (ఇయ్యాల తెలంగాణ) : కందికల్ చిత్రగుప్త దేవాలయం ప్రాంగణములోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ పూర్వ విద్యార్థుల, హితైషుల మహా సమ్మేళనము ఈ నెల 14 ఆదివారం 1985-2025 వరకు పాఠశాలలో చదివిన సుమారు 3000 మంది పూర్వ విద్యార్థులతో ఘనంగా నిర్వహించనున్నట్లు పాఠశాల నిర్వహకులు తెలిపారు. పూర్వ విద్యార్థులందరూ ఈ సమ్మేళనంలో పాల్గొనే విధంగా ఒకరికొకరు ప్రోత్సహాన్ని అందించాలని పాఠశాల నిర్వాహకులు కోరారు. ఈ పూర్వ విద్యార్థుల, హితైషుల మహా సమ్మేళన కార్యక్రంమలో ముఖ్య అథితులుగా కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ విశిష్ట అతిథులుగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు బి.బి. పాటిల్, బాలాక్సీ ఫార్మాసెటికల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మీనోషి మహేశ్వరి ముఖ్య వక్త దక్షిణ భారత విద్యా భారతి క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి అథితులుగా విద్యా పీఠం తెలంగాణ ప్రాంత సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్  తెలంగాణ పూర్వ విద్యార్ధి  పరిషత్  విద్యాపీఠం ప్రాంత కార్యదర్శి బొద్దు శ్రీనివాస్ తో పాటు పాఠశాలలో విద్యానభ్యసించిన అనేక మంది పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ సమ్మేళణంలో పాల్గొననున్నారు.    

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....