శ్రీ పోతులూరి వీరబ్రహ్మం విశ్వకర్మ సేవ సమితి ప్రత్యేక పూజలు

హైదరాబాద్, జూలై 20 (ఇయ్యాల తెలంగాణ) :  పోతులూరి వీరబ్రహ్మ విశ్వకర్మ సేవా సమితి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మల శ్రీకాంత్ చారి సమితి సలహాదారులు  బొమ్మల సాయిబాబా చారి పాతబస్తీ ప్రసిద్ధి చెందిన శ్రీ సింహ వాహిని మహాకాళి దేవాలయం లాల్ దర్వాజా అమ్మవారికి పట్టు వస్త్రాలు ఒడి బియ్యం యాప కొమ్మల కల్లు సాక సమర్పించారు.అనంతరం  ఉత్తమ సేవలు అందిస్తున్న ఏ. అరవింద్ కుమార్, మాజీ చైర్మన్ కె వెంకటేష్ పాతనగరం ఉమ్మడి దేవాలయాల వృత్తిదారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పేరోజి మహేశ్వర్ లకు  వృత్తుదారులకు విశిష్ట సేవలు అందిస్తున్న సందర్బంగా, పాతనగరంలో విశిష్ట కార్యక్రమాలు మన బోనాల పండుగ విలువను, పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేసి మన పాతనగరం విశిష్టతను తెలంగాణలోనే  కాకుండా భారతదేశం మొత్తం తెలియజేయాలని వాళ్ళ మనస్ఫూర్తిగా కోరుకొంటూ వారికి ఉత్తమ బోనాలు అవార్డు  ఇచ్చి సన్మానం చేయడం జరిగింది.   

శ్రీ పోతులూరి వీరబ్రహ్మం విశ్వకర్మ సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మల శ్రీకాంత్ చారి సమితి సలదారులు బొమ్మల సాయిబాబా చారి శ్రీ గోల్కొండ కోట జగదంబ మహాకాళి ఎల్లమ్మ తల్లి దేవాలయం పూజారి  సురేష్ చారి పూజారి యాదగిరి చారి,  జగ్గు సింగ్,  ప్రసన్న శాసక్ చారి తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....