SLV సినిమాస్‌ ప్రొడక్షన్‌ నెం.8 ‘‘చఐఏఖి కింగ్‌ ` జాకీ ` క్వీన్‌’’

దీక్షిత్‌ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా కాంబోలో ప్రతిష్టాత్మక బ్యానర్‌ ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ ప్రొడక్షన్‌ నెం.8  నిర్మిస్తున్న ‘‘చఐఏఖి కింగ్‌ ` జాకీ ` క్వీన్‌’’

బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘దసరా’లో దీక్షిత్‌ శెట్టి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. నటుడు శశి ఓదెల, దీక్షిత్‌ శెట్టి,  యుక్తి తరేజా కాంబోలో ూఒప సినిమాస్‌ బ్యానర్‌పై ఓ సినిమా రాబోతోంది. ఈ ప్రాజెక్ట్‌ ఈ ప్రతిష్టాత్మక బ్యానర్‌లో 8వ సినిమాగా తెరకెక్కుతోంది.  కె.కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ చిత్రాన్ని సుధాకర్‌ చెరుకూరి.. 90ల నాటి ఒక ప్రత్యేకమైన కథాంశంతో పీరియాడికల్‌ క్రైమ్‌ డ్రామాగా నిర్మిస్తున్నారు. మేకర్స్‌ ఇటీవలే కాన్సెప్ట్‌ గ్లింప్స్‌తో ప్రాజెక్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.మేకర్స్‌ రీసెంట్‌గానే లాంఛనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేశారన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో దసరా ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓదెల ప్రారంభ సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రంలో కింగ్‌గా దీక్షిత్‌ శెట్టి, జాకీగా శశి ఒదెలా, క్వీన్‌గా యుక్తి తరేజా కనిపించబోతోన్నారు. అందుకే ఈ చిత్రానికి చఐఏఖి కింగ్‌ ` జాకీ ` క్వీన్‌ అనే టైటిల్‌ను పెట్టారు. తాజాగా రిలీజ్‌ చేసిన ఈ టైటిల్‌ గ్లింప్స్‌తో సినిమాలోని ముఖ్య పాత్రలను పరిచయం చేశారు.టైటిల్‌ గ్లింప్స్‌ వెరైటీగా ఉండటంతో వెంటనే అందరినీ ఆకట్టుకుంది. దీక్షిత్‌ శెట్టి స్ట్రైకింగ్‌గా కనిపిస్తుండగా, శశి తన రగ్డ్‌ లుక్‌తో, యుక్తి తరేజా తన అందంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. రెండు తుపాకులు, గులాబీలతో ఈ మూవీ టైటిల్‌ను ప్రజెంట్‌ చేయడంతో ఈ మూవీ కథ ఎలా ఉండబోతోందో హింట్‌ ఇచ్చేశారు.ఈ చిత్రానికి పూర్ణచంద్ర తేజస్వి సంగీతాన్ని అందిస్తున్నారు. నాగేష్‌ బానెల్‌ సినిమాటోగ్రాఫర్‌గా, కార్తీక శ్రీనివాస్‌.ఆర్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. శ్రీకాంత్‌ రామిశెట్టి ప్రొడక్షన్‌ డిజైన్‌ను చూసుకుంటున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా ప్రారంభం కానుంది.

నటీనటులు : దీక్షిత్‌ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....