నిశ్శబ్ద విప్లవమే నిర్దేశిత లక్ష్య సాధన మార్గం : బండ్లగూడ Dy. EO శాంతా రాథోడ్

హైదరాబాద్ , నవంబర్  02  (ఇయ్యాల తెలంగాణ) : నిశ్శబ్ద విప్లవమే నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తుందనే టందుకు సౌమ్యయే ఉదాహరణ అని బండ్లగూడ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫిసర్ శాంతారాథోడ్ అన్నారు.  భోజన విరామం సమయంలో జరిగిన గ్రూప్ 1 ర్యాంకర్ సౌమ్య అభినందన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోట్ల అలీజ హైస్కూల్లో జరిగిన కార్యక్రమానికి విచ్చేసిన ఆమె పెద్ద పెద్ద లక్ష్యాలు సాధించేవారు ప్రత్యక్షంగా అగుపడరని నిరంతరం కృషి పట్టుదలల తోనె కల సాకారం చేస్తారని గ్రూప్ 1 డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్(డిఎస్ పి)గా ఎన్నికైన సౌమ్య నిలుస్తారని చెప్పారు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఏ శిక్షణలు లేకుండా కేవలం తండ్రి ప్రోద్బలంతో తల్లి ఆత్మీయ లాలింపుతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న సౌమ్యను, తలిదండ్రులను ఆమె అభినందించారు. తర్వాత డిప్యూటీ ఇన్స్ పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఆఫిసర్ దశరథ్ మాట్లాడుతూ, ఆడపిల్లలను చదివిస్తే తమలో వున్న సృజణాత్మకతను వెలికితీసి తెలివితేటలను ప్రదర్శించేందుకు వీలవుతుందని సౌమ్యను చదివించి గ్రూప్స్ పరీక్షలు రాయించి డి ఎస్పీని చేసిన ఘనత తలిదండ్రులకు దక్కుతుందని చెప్పారు. తర్వాత చంద్రాయణగుట్ట ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులు,స్కూల్స్ ఇన్స్ పెక్టర్ లక్ష్మణ్ సింగ్ మాట్లాడుతూ, బాలికలను చదివించితే రేపటి భవిష్యత్తును తీర్చిదిద్దే నిర్మాతలని ప్రతి ఒక్కరూ భావించాలని గ్రూప్ 1ర్యాంకర్ సౌమ్య తార్కాణమని తెలియజేశారు.


పిదప హైదరాబాద్ డెమోక్రాటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డి టి ఎఫ్) అధ్యక్షులు మల్లయ్య మాట్లాడుతూ, డిఎస్పీ పోస్టు సాధించి సౌమ్య తనను కన్న తలిదండ్రుల పేరును కీర్తి ప్రతిష్టలుతీసుకు వచ్చారని ఉద్ఘాటించారు. నేటి సమాజంలో పోటీతత్వం పెరిగిందని అహోరాత్రాలు శ్రమించినపుడే ఫలితం సాధ్యమని అలాంటి గమ్యానికి చేరుకుని సౌమ్య సఫళీకృతమైందని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టి ఆర్ టి ఎఫ్)హైదరాబాద్ అధ్యక్షులు డాక్టర్ శ్రీవాటి శ్రీనాథ్ పేర్కొన్నారు. పిదప శాలిబండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ ఎస్ విజయ భాస్కర్ మాట్లాడుతూ, గతంలో కొడుకుకే ప్రాముఖ్యత ఇచ్చేవారని నేడు కూతురునే కొడుకు మాదిరిగా చదివింపచేయడం మార్పుకు సంకేతమని చెప్పారు. చివరగా టి ఎస్ టి యు హైదరాబాద్ అధ్యక్షులు అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ,”భేటీ పడావో – భేటీ కో ఆగే బడావో” నినాదాన్ని ఆంగ్ల ఉపాధ్యాయులు గిరివర్ధన్ సార్ధకం చేసి సరియైన నిర్వచనంగా నిలిచారని అభినందనలు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో టి టి ఏ నాయకులు శంకర్ నాయక్, ఎస్టియు నాయకులు రామసుబ్బారావు, షడ్రక్, పిఆర్టియు నాయకులు ఆనంద్ రెడ్డి, సురేందర్, ఆప్టా నాయకురాలు రమాదేవి,ఎస్టియు పూర్వ నాయకులు ఎంఏ బాసిత్ ఖాన్,బండ్లగూడ సైదాబాద్ మండలాల టీచర్లు పాల్గొని  గ్రూప్ 1 ర్యాంకర్ డి ఎస్పీ సౌమ్య, తలిదండ్రులను శాలువాలతో అభినందనలతో ముంచెత్తారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....