SIపై చర్యలు తీసుకో వాలని దళిత మహిళ ఫిర్యాదు

పెద్దపల్లి  ఆగష్టు 5, (ఇయ్యాల తెలంగాణ ): తన పట్ల అమర్యాదాకర మైన భాషను వాడి ఆత్మగౌరవానికి భంగం కలిగించాడని పేర్కొంటూ పెద్దపల్లి ఎస్‌ఐ మహేందర్‌ పై అంబేడ్కర్‌ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు దేవ భారతి పెద్దపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్‌ కు  ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారతి మాట్లాడుతూ, బోజన్నపేట గ్రామంలోని ఇంటి స్థలం విషయంలో ఇరు కుటుంబాల మద్య జరుగుతున్న వివాదాం విషయంలో ఎస్‌ఐ ని సంప్రదించగా దళిత మహిళ అని చూడకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడటం జరిగిందని వాపోయింది. ఎస్‌ఐ వ్యాఖ్యలతో కలత చెంది ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్టు పేర్కొన్నారు. ఉన్నతాధికారులు న్యాయం చేయని పక్షంలో అంబేడ్కర్‌ సంఘం ఆద్వర్యంలో ఉద్యమం చేపడుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాల సంఘం రాష్ట ఉపాధ్యక్షురాలు ఆలేటి ఎల్లమ్మ, మహిళా సంఘం నాయకురాలు బోశాల శాంత, తదితరులు ఉన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....