Shiva Rani ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ !

చార్మినార్, ఆగస్టు 25 (ఇయ్యాల తెలంగాణ) : చార్మినార్ సుధా థియేటర్ విడిపి స్కూల్లో శివరాణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శివరాణి ఫౌండేషన్ అధ్యక్షురాలు శివరాణి ఠాగూర్ సంపత్ ప్రిన్సిపాల్ సురేష్ ల ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివరాణి ఫౌండేషన్ అధ్యక్షురాలు శివరాణి మాట్లాడుతూ అనాదిగా వస్తున్న మన వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులను పూజించడం వల్ల ప్రకృతి ని కాపాడడమే కాకుండా,  మనకు ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు. పాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన గణపతులు వాడటం వల్ల ఎన్నో రకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా మండపాల వద్ద భక్తికి సంబంధించిన పాటలు మాత్రమే పెట్టాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు.  సినిమా పాటలు లాంటివి పెట్టకూడదని తెలిపారు.  పిల్లల్లో విచిత్ర వేషాలు వేస్తూ నాటకాలు దేవుని గురించి పారాయణం చెప్పవలసిన అవసరం ఉందని తెలిపారు. ఉచిత మట్టి గణపతులను హెచ్ఎండిఏ సహకారంతో పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....