September 18 నుంచి 22 వరకు Parliament ప్రత్యేక సమావేశాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 31 (ఇయ్యాల తెలంగాణ) : పార్లమెంట్‌ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్‌ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ఇంత అత్యవసరంగా పార్లిమెంట్ సమావేశాలు నిర్వహించడం పట్ల సర్వత్రా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాబోయే పార్లిమెంట్ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించడానికి ఏదైనా బిల్లు పార్లిమెంట్ లో పెట్ట బోతున్నారా అంటూ సోషల్ మీడియాలో రక రకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇక పార్లమెంట్ సమావేశం లోనే అసలు విషయాలు ఏంటనేది తెలుస్తోంది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....