హైదరాబాద్ ఏప్రిల్ 10 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై గత కొద్ది రోజులుగా సోషల్ విÖడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఫలితాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తోందంటూ వస్తున్న వార్తలు విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ స్పందిస్తూ అధికారిక వివరణను విడుదల చేసింది. ఫలితాల ప్రకటనలో ఎలాంటి జాప్యం జరగడం లేదని, అదంతా కేవలం అవాస్తవ ప్రచారమేనని కొట్టిపారేసింది.గత పదేళ్లుగా ఇంటర్ ఫలితాలు ఎప్పుడూ ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కాలేదని విద్యాశాఖ అధికారులు తెలిపారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ, సాంకేతిక అంశాల పరిశీలన వంటి వివిధ కారణాల వల్ల ప్రతి ఏటా ఫలితాల తేదీలు మారుతూ వస్తున్నాయని చెప్పారు. 2014 నుంచి 2025 వరకు విడుదలైన తేదీలను గమనిస్తే.. ఫలితాలు ఏప్రిల్ మూడో వారం లేదా మే నెలలో వచ్చినట్లు స్పష్టమవుతోందని చెప్పారు. ఈమేరకు సోషల్ విÖడియాలో వైరల్ అవుతున్న వార్తలను ఫ్యాక్ట్ చెక్ చేస్తూ.. గతంలో రిజల్ట్స్ విడుదల చేసిన తేదీలను వెల్లడించారు.

2014 ఏడాదిలో మే 3, 2015లో ఏప్రిల్ 22న, 2016లో ఏప్రిల్ 22న, 2017లో ఏప్రిల్ 16న, 2018లో ఏప్రిల్ 13న, 2019లో ఏప్రిల్ 18న, 2020లో జూన్ 18న, 2021లో జూన్ 28న, 2022లో జూన్ 28న, 2023లో మే 9న, 2024లో ఏప్రిల్ 24న, 2025లో ఏప్రిల్ 22న ప్రకటించినట్లు చెప్పారు. కొవిడ్ సమయంలో అంటే 2020, 2021 పరిస్థితులు భిన్నంగా ఉండటంతో జూన్ నెలలో అందర్ని పాస్ చేస్తూ ఫలితాలు విడుదలయ్యాయని తెలిపారు. గతేడాది ఏప్రిల్ 22న ఫలితాలు ప్రకటించినట్లు స్పష్టం చేశారు. ఈ క్రమాన్ని బట్టి చూస్తే.. ఈ ఏడాది కూడా మూల్యాంకన ప్రక్రియ ముగిసిన వెంటనే షెడ్యూల్ ప్రకారం అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.సోషల్ విÖడియాలో వైరల్ అవుతున్న అసత్య వార్తలను నమ్మి విద్యార్థులు మానసిక ఒత్తిడికిలోను కావొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫలితాల తేదీ ఖరారు కాగానే విద్యాశాఖ స్వయంగా విÖడియా ద్వారా, అధికారిక వెబ్సైట్ల ద్వారా ఫలితాలు వెల్లడిస్తుందని పేర్కొంది. కేవలం అధికారిక పోర్టల్స్‌లో వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని కోరింది. తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే వారిపై కూడా నిఘా ఉంచామని, విద్యార్థుల భవిష్యత్తును దష్టిలో ఉంచుకుని ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని విద్యాశాఖ స్పష్టం చేసింది.కాగా, తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరి 25న ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా.. మార్చి 18తో పరీక్షలు ముగిశాయి. మొత్తం 1,495 పరీక్షా కేంద్రాల్లో సుమారు 9,97,075 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. గతంతో పోలిస్తే ఈసారి పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. ప్రస్తుతం జవాబు పత్రాల స్కానింగ్, కోడింగ్, డీ`కోడింగ్ ప్రక్రియలు సాగుతున్నట్లు తెలిసింది. ఫలితాల వెల్లడికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు కొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.
