SC/ST/BC మైనారిటీల తోనే సంపూర్ణ సెక్యులరిజం : TJS

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (ఇయ్యాల తెలంగాణ) :  ఎస్సీ, ఎస్టీ  బిసి  మైనారిటీల తోనే  సంపూర్ణ సెక్యులరిజం సాధ్యమవుతుందని పలువురు సెక్యులర్ వక్తలు తమ భావాలను వ్యక్త పరచారు. తెలంగాణ జన సమితి పార్టీ మరియు ఎన్జీవోస్ సివిల్ సోసైటి సంయుక్తాధ్వర్యంలో  “సెక్యులరిజం బలోపేతం ” అనే అంశంపై నాంపల్లి పార్టీ ప్రధాన కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టిజేఎస్ పార్టీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మమ్మద్ అఫ్జల్ భాయ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ఎఎంఆర్ ఇన్ఫ్రాటేక్చర్ చైర్మన్ ఎంఎ సిద్దికి మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా కరప్షన్ లేని పాలన ప్రజలకు అందిస్తేనే ప్రజా పాలన సులభమవుతుందని అన్నారు. సెక్యులరిజాన్ని బ్రతికించే రాజకీయ పార్టీలకే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలన్నారు. అనంతరం టిజేఎస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు చంద్రగిరి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ లకు మతపరమైన పార్టీలు తీవ్ర అన్యాయం చేశాయన్నారు. అనంతరం ఆల్ ఇండియన్స్ మైనారిటిస్ కౌన్సిల్ అధ్యక్షుడు సయ్యద్ మతిన్ అహ్మద్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సెక్యులర్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే ఎస్సీ ఎస్టీ  బిసి మైనారిటిలు ఐక్యం అవ్వాలని పిలుపునిచ్చారు. టీజేఎస్ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సయ్యద్ ముజాయద్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఈవిఎం మిషన్లను రద్దు చేస్తే ఈ దేశంలో సెక్యులర్ వ్యవస్ధ బలపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో యాకూత్ పూరా కాంగ్రస్ ఇన్చార్జి సయ్యద్ షౌకత్ బట్టల రాంచంర్  ఎంపిజే సలీల్అల్ హింది, సనాఉల్లా ఖాన్ ఇర్షాద్ అబ్దుల్ సత్తార్  బిసి సెల్నగర అధ్యక్షుడు జశ్వంత్  సురేష్ పాషాభాయ్ అశ్రఫ్  తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....