SC/ST ఐక్యవేదిక బోనాల సమర్పణ

SC/ST ఐక్యవేదిక  –  ఆషాడ మాసం బోనాల  జాతర

చార్మినార్,జులై 17 (ఇయ్యాల తెలంగాణ) : ఆషాడ మాసం బోనాల  జాతర ను పురస్కరించుకొని ఆదివారము పాతబస్తీ బోనాల సందర్భంగా తెలంగాణ ఎస్సీ/ఎస్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బుంగ శివకుమార్ వారి నివాసం నుండి  శ్రీ గాలి పోచమ్మ అమ్మవారికి,శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయానికి ప్రత్యేక బోనాలు సమర్పించారు. పటేల్ నగర్ లోని గౌలిపుర నివాసం నుంచి పోతరాజుల నృత్యాలతో, ఆడుతూ పాడుతూ బయలుదేరినారు. పటేల్ నగర్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయానికి బయలుదేరి అమ్మవారికి ఒడిబియ్యం పోయడం జరిగింది తొట్టెల సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అక్కడనుండి అంబిక నగర్ శ్రీ గాలి పోచమ్మ దేవాలయానికి బయలుదేరి అమ్మవారికి ఒడిబియ్యం పోసి తొట్టెల సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి తొట్టెలలు ఫలహారబండితో సకుటుంబ సమేతంగా కదలివెళ్లారు .

ఈ కార్యక్రమంలో బుంగ యాదగిరి. బుంగ అనిల్ కుమార్.బుంగ అశ్విన్ కుమార్.బుంగ సాయికుమార్. బుంగ శ్రవణ్ కుమార్.బుంగ సందీప్ కుమార్.బుంగ లిఖిత్ కుమార్. బుంగ ప్రదీమ్ కుమార్ తో పాటు మనోజ్ కుమార్. దేవరకొండ లక్ష్మణ చారి. నరేష్ చారి. మధు చారి. జనార్ధన్.  పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....