SC/ST ఉపవర్గీకరణ తక్షణమే అమలు దిశగా ప్రయత్నాలు !

సుప్రీం కోర్టులో  చారిత్రాత్మక తీర్పు

న్యూఢిల్లీ, ఆగస్టు 1 (ఇయ్యాల తెలంగాణ) : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. వర్గీకరణకు రాష్ట్రాలకు అధికారం కల్పిస్తూ తీర్పు వెలువరించింది. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని కోర్టు స్ఫష్టం చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం వర్గీకరణ చేపట్టేందుకు లైన్‌ క్లియర్‌ చేసింది. చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ సహా ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెల్లడిరచింది. ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలమే అని ఇప్పటికే కోర్టుకి కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచింది. ఇవాళ కోర్టు తీర్పు వెలువరించింది. మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనంలో 6:1 మెజార్టీతో ఈ తీర్పు వెల్లడైంది.జస్టిస్‌ బేలా త్రివేది మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. ఈ అంశంపై మొత్తం ఆరు ప్రత్యేక తీర్పులను వెల్లడిరచింది సుప్రీంకోర్టు. కోటాలో సబ్‌ కోటా ఉండడం తప్పు కాదని స్పష్టం చేసింది. అంతకు ముందు 2004లో ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈవీ చిన్నయ్య వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులో వర్గీకరణ సాధ్యం కాదని వెల్లడిరచింది. ఇప్పుడు ఈ తీర్పుని పక్కన పెడుతూ వర్గీకరణను సమర్థించింది ధర్మాసనం. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ అంశంపై మూడు రోజుల పాటు కేసు విచారణ జరిగింది. ఈ విచారణ తరవాత కోర్టు తీర్పుని రిజర్వ్‌లో ఉంచింది. ఇప్పుడు తీర్పు వెల్లడిరచింది. ‘‘వ్యవస్థాపరమైన వివక్ష కారణంగా ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వాళ్లు అన్ని అవకాశాలనూ అందిపుచ్చుకోలేకపోతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం కుల వర్గీకరణను చేయొచ్చు. కోటాలో సబ్‌కోటా ఉండడం తప్పేవిూ కాదు’’

` సుప్రీంకోర్టు

ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణ జరిగిన సమయంలో కేంద్రం కీలక విషయాలు కోర్టుకి వెల్లడిరచింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను తాము సమర్థిస్తున్నామని స్పష్టం చేసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. అయితే…జస్టిస్‌ బేలా త్రివేది మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. ఈ వర్గీకరణ సరికాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ అధికారం కల్పించడాన్ని వ్యతిరేకించారు. మిగతా 6గురు సభ్యులు మాత్రం ఒకే అభిప్రాయంతో తీర్పు వెలువరించారు.

బేలా త్రివేది ఎందుకు వ్యతిరేకించారు

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. వర్గీకరణను సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని తేల్చి చెప్పింది. అంతే కాదు. కోటాలో సబ్‌కోటా ఉండడం తప్పేవిూ కాదని స్పష్టం చేసింది. చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌తో పాటు మొత్తం 7గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. అయితే..ఇందులో ఆరుగురు సభ్యులు తీర్పుపై ఏకీభవించినా జస్టిసస్‌ బేలా త్రివేది మాత్రం విభేదించారు. ప్రస్తుతమున్న షెడ్యూల్‌ కులాల జాబితాలో సంస్కరణలు తీసుకొస్తామన్న పేరుతో రిజర్వేషన్‌ల మౌలిక సిద్ధాంతాన్నే కదిలించడం సరికాదని ఆమె తన వాదన వినిపించారు. షెడ్యూల్‌ కులాల్లో మళ్లీ ప్రత్యేకంగా గ్రూప్‌లు తీసుకు రావడం సరికాదని తేల్చి చెప్పారు. రిజర్వేషన్‌లు కల్పించిందే వెనకబడ్డ ూఅ వర్గానికి చేయూత అందించడానికి అని వివరించిన జస్టిస్‌ బేలీ త్రివేది, మళ్లీ ఇందులో వర్గీకరణ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇందులోనూ ప్రాధాన్యతల ఆధారంగా ఎక్కువ తక్కువ అని వర్గీకరించడం సరికాదని అభిప్రాయపడ్డారు.ప్రస్తుతానికి షెడ్యూల్‌ కులాలకు ప్రత్యేక హోదా కల్పించేలా రిజర్వేషన్‌ వ్యవస్థ ఉందని, ఇందులో ఎలాంటి మార్పులు చేయాలన్నా అది రాష్ట్రపతి ద్వారానే జరగాలని స్పష్టం చేశారు.

 రాజకీయ కారణాలను దృష్టిలో పెట్టుకుని ఆ అధికారం రాష్ట్ర  ప్రభుత్వాలకు కల్పించలేదని వివరించారు. అందుకే ఆ పరిమితులు విధించాల్సి వచ్చిందని తెలిపారు. కానీ…మిగతా ఆరుగురు జస్టిస్‌లు ఒకే అభిప్రాయానికి రావడం వల్ల 6:1 మెజార్టీతో వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వెలువరించారు. ఇక మరో ప్రత్యేక బెంచ్‌లో జస్టిస్‌ పంకజ్‌ మిథాల్‌ మెజార్టీ అభిప్రాయాలకే మొగ్గు చూపించారు. అయితే..ఈ సందర్భంగా ఆయన కొన్ని సూచనలు చేశారు. కులం, సామాజిక స్థితిగతులు, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా అందరికీ రిజర్వేషన్‌లు ఇవ్వడం కన్నా ఓ కుటుంబంలో ఓ తరానికి మాత్రమే వీటిని పరిమితం చేస్తే బాగుంటుందని చెప్పారు. ఓ తరం రిజర్వేషన్‌ల ద్వారా లబ్ధి పొందితే ఆ తరవాతి తరానికి ఈ వెసులుబాటు లేకుండా చూడాలని సూచించారు. మరో సభ్యుడు జస్టిస్‌ చంద్ర శర్మ మెజార్టీ అభిప్రాయాన్నే గౌరవిస్తున్నట్టు వెల్లడిరచారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉండడం సరైందే అని సమర్థించారు. ఫిబ్రవరిలో ఈ అంశంపై సుప్రీంకోర్టు మూడు రోజుల పాటు విచారణ జరిపింది. ఆ తరవాత తీర్పుని రిజర్వ్‌లో ఉంచింది. చివరకు సానుకూలంగా తీర్పు వెలువరించింది. 2004లో ఈవీ చిన్నయ్య వర్సెస్‌ ఏపీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని రివ్యూ చేయాలని సీనియర్‌ అడ్వకేట్‌లు కోరారు. రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేపట్టే అధికారం లేదని అప్పటి ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ వాదననూ పరిగణనలోకి తీసుకున్న ప్రస్తుత ధర్మాసనం పూర్తి స్థాయిలో విచారణ జరిపి తుది తీర్పు వెల్లడిరచింది. ఈ తీర్పుని రాజకీయ పార్టీలన్నీ స్వాగతించాయి. ఈ వర్గీకరణకు అనుకూలంగా అవసరమైతే వెంటనే ఆర్డినెన్స్‌ తీసుకొస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....