సరికొత్త Records సృష్టిస్తోన్న Gold

ముంబై, జనవరి 21 (ఇయ్యాల తెలంగాణ) :   దేశీయ మార్కెట్లో బంగారం ధర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బుధవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో పసిడి ఫ్యూచర్స్ ధర మునుపెన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరింది. అమెరికా`యూరప్ మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతుందన్న భయాలు, డాలర్ బలహీనపడటంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 4.25శాతం (సుమారు రూ. 4,100) పెరిగి 10 గ్రాములకు రూ.1,56,970 వద్ద సరికొత్త ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది.బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. ఎంసీఎక్స్ మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ ధర 2.71శాతం పెరిగి కిలోకు రూ. 3,32,451కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఇదే ధోరణి కనిపించింది. కామెక్స్‌లో ఔన్స్ బంగారం ధర 4,849 డాలర్లకు చేరింది.

పెరుగుదలకు కారణాలివే..

ఫిబ్రవరి 1 నుంచి ఎనిమిది యూరోపియన్ దేశాలపై అమెరికా సుంకాలు విధించనుందని, జూన్‌లో ఈ సుంకాలను 25 శాతానికి పెంచవచ్చని వచ్చిన నివేదికలు ఈ ర్యాలీకి ఆజ్యం పోశాయి. దీంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలగా, ఇన్వెస్టర్లు బంగారం, వెండి వైపు మళ్లారని పథ్విఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్ విశ్లేషకులు మనోజ్ కుమార్ జైన్ తెలిపారు. దీనికి తోడు రూపాయి బలహీనపడటం కూడా దేశీయంగా ధరల పెరుగుదలకు మద్దతునిస్తోంది.సోలార్, ఎలక్టిక్ వాహనాలు, ఏఐ వంటి రంగాల నుంచి వెండికి పారిశ్రామిక డిమాండ్ బలంగా ఉండటంతో దీర్ఘకాలంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న నెలల్లో ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర రూ.3,50,000 స్థాయికి చేరవచ్చని భావిస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....