శృంగారం కాదంటే భార్యకు విడాకులు ఇవ్వొచ్చు

ముంబై, జూలై 19  (ఇయ్యాల తెలంగాణ) : భార్య శృంగారానికి అంగీకరించకపోతే విడాకులు ఇవ్వొచ్చని బాంబే హైకోర్టు స్పష్టం  చేసింది. ఇదే కారణంతో విడాకుల కోసం పిటిషన్‌ వేసిన ఓ వ్యక్తి అభ్యర్థనను అనుమతిస్తూ కుటుంబ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ  మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింద   భర్తతో శారీరక సంబంధాన్ని తిరస్కరించడం,అతనికి  వివాహేతర సంబంధం ఉందని అనుమానించడం క్రూరత్వానికి సమానమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.  విడాకులు ఇచ్చేందుకు ఇది కూడా  ఒక కారణం అని  తెలిపింది.  కుటుంబ కోర్టు విడాకుల ఉత్తర్వును సవాలు చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసి పుచ్చింది. జస్టిస్‌ రేవతి మోహితే , నీలా గోఖలేలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ గురువారం ఆ మహిళ ప్రవర్తనను ఆమె భర్తపై ‘‘క్రూరత్వం’’గా భావించవచ్చని పేర్కొంది. విడాకుల కోసం  వ్యక్తి అభ్యర్థనను అనుమతిస్తూ కుటుంబ కోర్టు  ఉత్తర్వు ఇచ్చింది. దీన్ని కొట్టివేయడంతో పాటు తనకు  నెలవారీ రూ. లక్ష భరణం చెల్లించాలని ఇప్పించాలని కోర్టులో మహిళ వాదించింది. ఈ జంట 2013లో వివాహం చేసుకున్నా. కానీ డిసెంబర్‌ 2014లో విడివిడిగా జీవించడం ప్రారంభించారు. 2015లో, ఆ వ్యక్తి క్రూరత్వం కారణంగా విడాకులు కోరుతూ పూణేలోని కుటుంబ కోర్టును ఆశ్రయించాడు. కుటుంబ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఆ మహిళ తన పిటిషన్‌లో తన అత్తమామలు తనను వేధించారని ఆరోపించింది.  అయితే తనకు తన భర్తపై ప్రేమ ఉందని, అందుకే వివాహం ముగియాలని కోరుకోవడం లేదని పేర్కొంది.కానీ శారీరక సాన్నిహిత్యాన్ని తిరస్కరించడం, వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని అనుమానించడం, తన కుటుంబం, స్నేహితులు, ఉద్యోగుల ముందు తనను ఇబ్బంది పెట్టడం ద్వారా మానసిక వేదనకు గురిచేయడం వంటి అనేక కారణాల వల్ల తాను క్రూరత్వాన్ని అనుభవించానని ఆ వ్యక్తి కోర్టుకు తెలిపారు. భర్తకు   ప్రత్యేక వైకల్యం ఉన్న సోదరి ఉంది. ఆ  మహిళ ఉదాసీనంగా  కూడా అతనికి ,  అతని కుటుంబ సభ్యులకు బాధను కలిగిస్తుందని కోర్టు పేర్కొంది. మహిళ పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు, దంపతుల మధ్య వివాహం చెడిపోయిందని, సరిదిద్దుకునే అవకాశం లేకుండానే విచ్ఛిన్నమైందని పేర్కొంది. విడాకులు మంజూరు చేస్తూ కుటుంబ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....