👉 అతి వేగం, అజాగ్రత్తగా వల్లే ఎక్కువ శాతం ప్రమాదాలు
👉రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలి
జగిత్యాల, ఫిబ్రవరి 14 (ఇయ్యాల తెలంగాణ) : ట్రాఫిక్ నియమాలు పాటించి వాహనాల వేగాని నియంత్రించి నప్పుడే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని,రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఓల్డ్ బస్టాండ్ లో హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీని జిల్లా ఎస్పీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో పరిదీ లో హెల్మెట్ ఆవశ్యకత, సీట్ బెల్ట్ ధరించడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ,డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడిరగ్, డేంజరస్ డ్రైవింగ్,గూడ్స్ వెహికల్ క్యారింగ్ ప్యాసింజర్, సిగ్నల్ జంపింగ్ చేయడం, లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్ టేక్ చేయడం వీటి పైన110 కు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.. బారి వాహనలైన లారీ, ట్రాక్టర్, టిప్పర్ వంటి వాహనాలకు వెనుక వైపున రేడియం స్టిక్కర్ అంటించారు. ట్రాఫిక్ నియమాల పై 1000 పైగ విద్యార్థులకు అవగాహన నిర్వహించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోంది అని పోలీస్ శాఖ ఎన్ని చర్యలు చేపట్టిన ప్రజలు కుడా భాగస్వామ్యం అయితేనే ప్రమాదాలను పూర్తిగా నివారించగలమని అన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా స్థాయిలో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో డిస్టిక్ రోడ్ సేఫ్టీ బ్యూరో ని ప్రారంభించి ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంట రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఈ విభాగం పరిశీలించి రోడ్డు ప్రమాదాలకు గల కారణాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలుపై ఈ విభాగం అధికారులు నివేధిక అందజేస్తారని అన్నారు. జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్నా చర్యల వల్ల 2022 సంవత్సరంతో పోలిస్తే 2023 సంవత్సరంలో 25 రోడ్ ఆక్సిడెంట్ మరణాల సంఖ్య మరియు 43 గాయపడిన వారి సంఖ్య తగ్గాయని అన్నారు. రోడ్డు ప్రమాదాల ను పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉందని అందులో బాగంగా పోలీస్ కళా బృందం ద్వారా జాతీయ రహదారి పై ఉన్న అన్ని గ్రామాల్లో అవగాహాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆదేవిదంగా హైవేలపై జరిగే యాక్సిడెంట్ లకు సంబంధించి ఫస్ట్ రెస్పాండర్స్ గా ఉండేందుకు హైవేలపై ఉన్న పెట్రోల్ బంక్ వారికి, ధాబాలో పనిచేసే వారికి, యూత్ ,విలేజెస్, కి ఫస్ట్ ఎయిడ్ మరియు సిపిఆర్ పై అవగాహన కల్పిస్తునామని అన్నారు. జిల్లా లో ఉన్న 44 బ్లాక్ స్పాట్స్(ప్రమాదాలు అధికముగా జరుగు ప్రదేశాలు) ను పంచాయతీ రాజ్ మరియు ఆర్ అండ్ బి ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రమాదాల నివరణ పై దృష్టి సారిస్తునామన్నారు. వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ప్రమాదం జరిగితే ఒక నిండు జీవితం బలి కావడం జరుగుతుందని కావున ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వీలైనంతవరకు తక్కువ వేగంతో వాహనాలు నడపాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నియమాలను పాటించి ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.
ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్ లను ఇచ్చారు. అదేవిధంగా ట్రాఫిక్ నియమాలకు సంబంధించిన పోస్టర్ ను,కరపత్రాలు, ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రభాకరరావు ,డిఎస్పీ రఘు చందర్,టౌన్ ఇన్స్పెక్టర్ నటేష్, ఇన్స్పెక్టర్ రఫీ ఖాన్, ట్రాఫిక్ ఎస్.ఐ రామచంద్రం,ఎన్జీవో గన్ శ్యామ్ ఓజా, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

.jpeg)
.jpeg)