ROAD ప్రమాదంలో 7 మృతి 14 మందికి గాయాలు

కుప్పం సెప్టెంబర్ 11 (ఇయ్యాల తెలంగాణ ): తమిళనాడు సరిహద్దులోని  నాట్రాం పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో   ఏడుగురు మృతి చెందగా పద్నాలుగుమందికి గాయాలలయ్యాయి. తమిళనాడు పేరునాంబట్‌ కు చెందిన 25 మంది ధర్మస్థల వెళ్లి వస్తున్నసమయంలో వారి టెంపో ట్రావెలర్‌ బ్రేక్‌ డౌన్‌ అయింది. దాంతో ప్రయాణికులు ఆగిన టెంపో ట్రావెలర్‌ ముందు నిలబడి వున్నారు. ఆదే సమయంలో ఒక లారీ వెనకనుంచి వచ్చి టెంపో ట్రావేలర్‌ ను  ఢీకొంది. దాంతో టెంపో ముందున్న  జనం పైకి దూసుకెళ్లింది.  ఏడుగురు ప్రమాదస్థలంలోనే మృతి  చెందారు. మరో 14 మందికి గాయాలు  అయ్యాయి. వారందరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....