Rebel Star ప్రభాస్‌ ‘‘రాజా సాబ్‌’’, ఈ నెల 16న టీజర్‌ విడుదల

డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ కు రాబోతున్న రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘‘రాజా సాబ్‌’’, ఈ నెల 16న  టీజర్‌ విడుదల కానుంది. 

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ మారుతి, ప్రెస్టీజియస్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పీపుల్‌ విూడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌ లో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘‘రాజా సాబ్‌’’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ కు తీసుకొస్తున్నట్లు ఈ రోజు మేకర్స్‌ ప్రకటించారు. ఈ నెల 16న ఉదయం 10.52 నిమిషాలకు ‘‘రాజా సాబ్‌’’ టీజర్‌ విడుదల చేయబోతున్నారు. ఈ మోస్ట్‌ అవేటెడ్‌ అనౌన్స్‌ మెంట్‌ తో రెబెల్‌ ఫ్యాన్స్‌ తో పాటు మూవీ లవర్స్‌ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ అనౌన్స్‌ మెంట్‌ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ లో ప్రభాస్‌ డబ్బులతో నిండి ఉన్న గదిలో ఫెరోషియస్‌ గా కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది.  మరోవైపు ‘‘రాజా సాబ్‌’’ రిలీజ్‌ డేట్‌, టీజర్‌ రిలీజ్‌ అనౌన్స్‌ మెంట్‌ సోషల్‌ విూడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది.’’రాజా సాబ్‌’’ సినిమాను భారీ ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ తో అన్‌ కాంప్రమైజ్డ్‌ గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌. ప్రభాస్‌ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్‌ హారర్‌ జానర్‌ లో ఈ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా విూద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. ‘‘రాజా సాబ్‌’’ సినిమాతో ప్రేక్షకులకు ఎవర్‌ గ్రీన్‌ సినిమాటిక్‌ ఎక్సిపీరియన్స్‌ ఇవ్వబోతున్నారు డైరెక్టర్‌ మారుతి.

నటీనటులు ` ప్రభాస్‌, నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిద్ది కుమార్‌, తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....