R&B రోడ్లపై ఏర్పడిన పెద్ద గుంతలు – పట్టించుకోని అధికారులు.

ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు.

రుద్రవరం. జూలై 30 (ఇయ్యాల తెలంగాణ) : రహదారులు అభివృద్ధికి చిహ్నాలుగా చెప్పుకునే అధికారులు కొన్నిసంవత్సరాల క్రితం నిర్మించిన ఆర్‌ అండ్‌ బి రోడ్లు మరమ్మతులు చేపట్టక పోవడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నెలవుగా మారాయి. రుద్రవరం, ఆళ్లగడ్డ ప్రధాన రహదారిలో నరసాపురం వెళ్లే దారిలో రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. రుద్రవరం మండల పరిషత్‌ కార్యాలయం సవిూపంలో ఆర్‌ అండ్‌ బి రోడ్డుపై పెద్ద గుంతఏర్పడడంతో ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ ప్రధాన రహదారి వెంట అహోబిలం, మహానంది క్షేత్రాలకు వెళ్లి భక్తులు నిత్యం వాహనాలలో ప్రయాణిస్తుంటారు. గుంతను గమనించని వాహనదారులు అక్కడికి రాగానే ప్రమాదానికి గురికావాల్సి వస్తుంది. మోటార్‌ సైకిల్‌ పై వెళ్లే ప్రయాణికులు గుంత దగ్గర కిందపడి తీవ్ర గాయాల బారిన పడుతున్నారు. మరి కొంతమంది ప్రాణాలు వదులుతున్నారు. ఆర్‌ అండ్‌ బి అధికారులు రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టకపోవడంతో ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ గుంతల దగ్గర మరి కొంతమంది గాయాల బారిన పడకుండా ప్రాణాలు పోకుండా చూడాల్సిన బాధ్యత ఆర్‌ అండ్‌ బి అధికారులపై ఉందని ప్రయాణికులు అంటున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....