నిర్మల్ జిల్లా, జూలై 27 (ఇయ్యాల తెలంగాణ) : కడెం ప్రాజెక్క్ట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో జయశంకర్ , నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎమ్మెల్యే రేఖ్య నాయక్ డ్యామ్ ను పరిశీలించారు. వరద ఉధృతి తీవ్రంగా పెరుగుతున్న విషయాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తకై అధికారులతో కలసి చర్చించారు.
