R R R సంక్రాంతికి – రాజమౌళి బిజీ బిజీ

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ మల్టీస్టారర్‌ ’ఆర్‌.ఆర్‌.ఆర్‌’. వచ్చే ఏడాది సంక్రాంతికి వారం రోజులు ముందుగానే అంటే జనవరి 7న  ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌ లో సందడి చేయబోతున్న ఈ సినిమా టాకీ పార్ట్‌ ను రీసెంట్‌గా పూర్తి చేశారు. తారక్‌, చెర్రీ డబ్బింగ్‌ చెప్పడం కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు వేగవంతం చేశారు.  దీపావళి నుంచి ’ఆర్‌.ఆర్‌.ఆర్‌’ మూవీ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు. ఈలోగా ఈ సినిమా ఫైనల్‌ కట్‌ ను కూడా జక్కన్న పూర్తి చేయబోతున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రఫ్‌ కట్‌ దాదాపు 3 గంటల డ్యూరేషన్‌తో వచ్చిందట. దాన్ని 2గంటల 45 నిమిషాలకు తగ్గించడానికి రాజమౌళి అండ్‌ టీమ్‌ ప్రయత్నిస్తోందట. ఇక త్వరలో ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ ను విడుదల చేస్తారట. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....