PRESIDENT OF BHARAT.. G20 INVITATION పై వివాదం

న్యూఢల్లీ సెప్టెంబర్‌ 6 (ఇయ్యాల తెలంగాణ );  జీ20 దేశాల నేతలకు విందు ఇవ్వనున్న నేపథ్యంలో.. ఓ ఇన్విటేషన్‌ పత్రికపై కొత్తగా ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌అని రాశారు. రాష్ట్రపతి ముర్ము ఇచ్చే ఆ విందు ఆహ్వాన కార్డులో.. ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా బదులుగా .. ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అని రాయడం వివాదాస్పదం అవుతోంది. జీ20 విూటింగ్‌కు వివిధ దేశాధినేతలు హాజరవుతున్న ఆ వేడుక సమయంలో.. ఇండియాను భారత్‌గా గుర్తిస్తూ ఇన్విటేషన్‌ను ప్రచురించడం సంచలనంగా మారింది. జీ20 దేశాధినేతలతో పాటు ముఖ్యమంత్రులకు సెప్టెంబర్‌ 9వ తేదీన విందు ఇవ్వనున్నారు.ఓ అధికారిక కార్యక్రమానికి ఇన్విటేషన్‌పై ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అని రాయడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతన్నారు. భారత్‌ అన్న పదం మన రాజ్యాంగంలో ఉందని అధికారులు తెలిపారు. ఇండియా లేదా భారత్‌, ఆర్టికల్‌ 1 ప్రకారం యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌గా గుర్తిస్తారు. విదేశీ ప్రతినిధులకు అందజేసిన జీ20 బుక్‌లెట్‌లోనూ భారత్‌ అన్న పదాన్ని వాడారు. ప్రజాస్వామ్యానికి భారత్‌ తల్లి లాంటిదని, వేల ఏండ్ల నుంచి ఇక్కడ సుసంపన్నమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లితున్నట్లు ఓ బుక్‌లెట్‌లో రాశారు.రాష్ట్రపతి డిన్నర్‌ ఇన్విటేషన్‌ కార్డు లీకైన తర్వాత.. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తన ట్వీట్‌లో హర్షం వ్యక్తం చేశారు. రిపబ్లిక్‌ ఆఫ్‌ భారత్‌ అని రాస్తూ.. మన నాగరికత ముందుకు వెళ్లడం గర్వంగా ఉందని అన్నారు. తాము అనుకున్నట్లే పేరు మార్చారని కాంగ్రెస్‌ నేత జయరాం రమేశ్‌ విమర్శించారు. ఇండియాను భారత్‌ అని పిలువాలని కొన్ని రోజుల క్రితం ఆర్‌ఎస్‌ఎస్‌ నేత మోహన్‌ భగవత్‌ పిలుపునిచ్చారు. ఇటీవల విపక్ష పార్టీలు తమ కూటమికి ఇండియా అన్న పేరు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఇండియా, భారత్‌ అంశంపై వివాదం చెలరేగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి ఇండియా అన్న గుర్తింపు ఉంది. అయితే గతంలో ఈ విశాల దేశాన్ని భారత్‌గా పిలిచేవారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....