ప్రీరిలీజ్‌ Eventలో Super స్టార్‌ శివరాజ్‌ కుమార్‌

జూనియర్‌’తో కిరీటి రూపంలో మరో ప్రామిసింగ్‌ స్టార్‌ ఇండస్ట్రీకి వస్తున్నాడు. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను: ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌

ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్‌ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘జూనియర్‌’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌ గా నటిస్తోంది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్‌ హిట్‌ అయ్యాయి. టీజర్‌, ట్రైలర్‌ కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ బెంగళూరులో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌ గా జరిగింది.

ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ లో సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం . కిరీటీ నాకు చిన్నప్పటినుంచి తెలుసు. జూనియర్‌ టీజర్‌, ట్రైలర్‌,పాటలు చూశాను. కిరీటి చాలా అద్భుతంగా డాన్స్‌ చేశాడు. తన పెర్ఫార్మన్స్‌ చాలా బాగుంది. కిరిటి రూపంలో మరో ప్రామిసింగ్‌ స్టార్‌ ఇండస్ట్రీకి వస్తున్నాడు.  తను డాన్స్‌ లో సూపర్‌ సీనియర్‌ అనిపిస్తున్నారు. అలాగే శ్రీలీల కూడా మంచి డ్యాన్సర్‌. వారి కెమిస్ట్రీ చాలా బాగుంది. జెనీలియా గుడ్‌ హ్యూమన్‌ బీయింగ్‌. తను ఈ సినిమాలో చాలా చక్కని పాత్ర పోషించారు.   రవిచంద్రన్‌ అన్నతో నాకు ఎప్పటినుంచో స్నేహం ఉంది. ఆయన ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్‌ చేస్తున్నారు. డైరెక్టర్‌ సినిమాని చాలా అద్భుతంగా తీశారని ప్రమోషనల్‌ కంటెంట్‌ చూస్తే అర్థమవుతుంది. దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ సూపర్‌ స్టార్‌. జనార్దన్‌ రెడ్డి గారు ఈవెంట్‌ గురించి చెప్పినప్పుడు తప్పకుండా వస్తాను. ఇది నా ఫ్యామిలీ ఈవెంట్‌ అని చెప్పాను. కిరీటికి ఎప్పుడు నా ఆశీస్సులు ఉంటాయి. కిరీటికి శ్రీలీలకి టీమ్‌ అందరికీ ఆల్‌ ది వెరీ బెస్ట్‌. జూలై 18న రిలీజ్‌ అవుతున్న సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’అన్నారు.

గాలి జనార్దన్‌ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసి చిత్ర బృందాన్ని ఆశీర్వదించిన డాక్టర్‌ శివరాజ్‌ కుమార్‌ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ సినిమాలో రవిచంద్రన్‌ గారు, కిరీటి నటించిన సీన్స్‌ అన్ని అద్భుతంగా ఉన్నాయి. ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన జెనీలియా గారు ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. వారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పాత్రని దేశము మొత్తం అభిమానిస్తుంది. బాహుబలి లాంటి అద్భుతమైన సినిమాలకు పనిచేసిన కెమెరామెన్‌ స్న్తిల్‌ కుమార్‌ గారు ఈ సినిమాకి పనిచేయడం కిరీటి అదృష్టం. నేను సాయి గారు కర్ణాటకలో ఒకే స్కూల్లో చదువుకున్నాం. వారాహి బ్యానర్‌ తో ఆయన దేశవ్యాప్తంగా చాలా అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కిరీటి చిన్న వయసులో ఉన్నప్పుడే తనతో సినిమా చేస్తానని ఆయన చెప్పడం  గొప్ప ఆశీర్వాదం. శ్రీలీల నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తను దేశవ్యాప్తంగా చాలా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నారు .పునీత్‌ రాజ్‌ కుమార్‌ గారి ఆశీస్సులు కిరీటిపై ఉన్నాయి. జేమ్స్‌ సినిమా సమయంలో కిరీటికి ఆయనతో సమయాన్ని గడిపే అదృష్టం దక్కింది. కిరీటికి చిన్నప్పటినుంచి యాక్టింగ్‌ డాన్సింగ్‌ అంటే ఇష్టం. తను ఒక పాషన్‌ తోనే ఈ పరిశ్రమలోకి వస్తున్నాడు. కిరీటిపై అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. చాలా మంచి సినిమా ఇది. మన ఇంట్లో జరిగే కథలాగా ఉంటుంది. తప్పకుండా సినిమాని చూసి విూరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’అన్నారు.  

యాక్టర్‌ రవిచంద్రన్‌ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమా ఒక తండ్రి కల గురించి. ఈ సినిమాతో మూడేళ్ల జర్నీ ఉంది. ఈ టీమ్‌ అందరితో ఒక ఎమోషన్‌ ఉంది. ఇందులో నేను ప్లే చేసిన ఫాదర్‌ క్యారెక్టర్‌ చాలా స్పెషల్‌ గా ఉంటుంది. ఈ క్యారెక్టర్‌ ని ప్లే చేయడం చాలా ఆనందంగా ఉంది. తండ్రి కొడుకుల అనుబంధం వారి మధ్య ఉన్న భావోద్వేగం అందరినీ కదిలిస్తుంది. ఇలాంటి అద్భుతమైన కథరాసిన రాధాకృష్ణకి సెల్యూట్‌. ఇది ఎక్స్ట్రార్డినరీ మూవీ. సెంథిల్‌ కుమార్‌. దేవి శ్రీ ప్రసాద్‌ గారు, జెనీలియా గారు అందరూ ఈ సినిమాకి గొప్ప బలాన్ని చేకూర్చారు. ఫాదర్స్‌ అండ్‌ ఎమోషనల్‌ ఈ సినిమాకి ప్రధాన బలం. కిరీటి 100% ఎఫర్ట్‌ పెట్టాడు.   సినిమా ప్రారంభమైంచి చివరి వరకు ఒక విద్యార్థి లాగే నేర్చుకున్నాడు. ప్రతిక్షణం క్యారెక్టర్‌ లోనే జీవించాడు. జూలై 18న థియేటర్స్‌ లో జూనియర్‌ ని సెలబ్రేట్‌ చేసుకుందాం.’అన్నారు.  

హీరో కిరీటి మాట్లాడుతూ… అందరికి నమస్కారం. శివన్న గారికి కృతజ్ఞతలు.శివన్న గారు, అప్పు గారు నేను సినిమాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్‌. నాకు ఇంత మంచి సినిమాతో లాంచ్‌ చేస్తున్న నిర్మాత సాయి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. డైరెక్టర్‌ రాధాకృష్ణ ఈ సినిమా కోసం మూడేళ్లు డెడికేటెడ్‌ గా వర్క్‌ చేశారు. ఒక బ్రదర్‌ లాగా సపోర్ట్‌ చేశారు. ఆయన తప్పకుండా భవిష్యత్తులో చాలా పెద్ద డైరెక్టర్‌ అవుతారు. జెనీలియా గారు 13 ఏళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్‌ పై కం బ్యాక్‌ ఇస్తున్నారు. ఆమెతో వర్క్‌ చేయడం గ్రేట్‌ ఎక్స్పీరియన్స్‌. రవిచంద్రన్‌ గారితో వర్క్‌ చేయడం నా అదృష్టం. ఆయనతో పనిచేస్తున్న రోజులని నా జీవితంలో మర్చిపోలేను. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మా నాన్నగారు నాకోసం చాలా త్యాగాలు చేశారు. ఆయన కొడుకుగా పుట్టడం నా అదృష్టం.సెంథిల్‌ గారు నన్ను అద్భుతంగా ప్రజెంట్‌ చేశారు. ప్రతి ఫ్రేమ్‌ ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. విజువల్‌ గా ఈ సినిమా ప్రేక్షకులకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్‌ ఇస్తుంది. దేవిశ్రీప్రసాద్‌ గారి మ్యూజిక్‌ ఈ సినిమాకి బిగ్గెస్ట్‌ ఎసెట్‌. శ్రీ లీల ఎనర్జిటిక్‌ కోస్టార్‌. చాలా డెడికేషన్‌ తో ఈ సినిమా చేశారు. జూలై 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. విూరందరూ గొప్ప మనసుతో ఆశీర్వదించి సినిమాకి మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’అన్నారు.

హీరోయిన్‌ శ్రీల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా జర్నీ చాలా వండర్ఫుల్‌ గా జరిగింది. రాధాకృష్ణ గారు చాలా క్లియర్‌ విజన్‌ ఉన్న డైరెక్టర్‌. ఈ కథని చాలా అద్భుతంగా చెప్పారు. రవిచంద్రన్‌ గారితో కలిసి వర్క్‌ చేయడం చాలా గొప్ప ఎక్స్పీరియన్స్‌. జెనీలియా గారితో కలిసి పని చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి స్ట్రాంగ్‌ పిల్లర్‌ నిర్మాత సాయి గారు. చాలా ప్రేమతో ఈ సినిమా చేశారు. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు.   శివన్న గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. కిరీటితో వర్క్‌ చేయడం వండర్ఫుల్‌ ఎక్స్పీరియన్స్‌. డాన్స్‌ పెర్ఫార్మెన్స్‌ లో ఒక వెపన్‌ గా అనిపించారు. వైరల్‌ వయ్యారి సాంగ్‌  వైరల్‌ కావడానికి కారణం దేవిశ్రీప్రసాద్‌ గారు. ఆయన ఈ సినిమాకి అద్భుతమైన ఆల్బమ్‌ ఇచ్చారు. జూలై 18న ఈ సినిమా వస్తుంది. తప్పకుండా విూ అందరికీ నచ్చుతుంది. విూ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.’అన్నారు

జెనీలియా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. కన్నడలో నా లాస్ట్‌ సినిమా శివకుమార్‌ గారితో చేశాను. అది నాకు చాలా స్పెషల్‌ ఫిలిం .మళ్లీ జూనియర్‌ తో ప్రేక్షకులు ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. కిరీటి ఒక న్యూ కమ్మర్‌ లాగా అనిపించడం లేదు. తన యాక్టింగ్‌ పెర్ఫార్మన్స్‌ డాన్స్‌ అద్భుతంగా ఉన్నాయి. కిరీటీ శ్రీలీల నాకు న్యూ కమర్స్‌ లాగా అనిపించలేదు. నెక్స్ట్‌ లెవెల్‌ లో ఉన్నారు. కిరీటి వండర్ఫుల్‌ యాక్టర్‌.  శ్రీల బ్యూటిఫుల్‌ డాన్సర్‌. నిర్మాత సాయి గారు చాలా అద్భుతంగా ఈ ప్రాజెక్టుని తీర్చిదిద్దారు. రాధా గారు వండర్ఫుల్‌ డైరెక్టర్‌. ఆయన మరిన్ని గొప్ప సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. దేవిశ్రీప్రసాద్‌ గారి మ్యూజిక్‌ చాలా స్పెషల్‌ గా ఉంటుంది. జూలై 18న సన్మాని థియేటర్స్‌ లో చూడండి. తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు’అన్నారు.

డిఓపి సెంథిల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. కిరీటి చాలా టాలెంటెడ్‌. చాలా హార్డ్‌ వర్క్‌ చేస్తాడు. తన యాక్షన్‌ డాన్స్‌ చాలా అద్భుతంగా ఉంటాయి. తన పర్ఫార్మెన్స్‌ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అది విూరు సినిమాల్లో చూస్తారు. తనకి చాలా బ్రైట్‌ ఫ్యూచర్‌ ఉంది. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. రాధాకృష్ణ చాలా టాలెంటెడ్‌ డైరెక్టర్‌ . ఈ సినిమా కథ నాకు చాలా నచ్చింది. చాలా ప్రేమతో చేసిన సినిమా ఇది. జులై 18న విూరందరూ థియేటర్స్‌ కి వచ్చి  సినిమా చూడండి. తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు’అన్నారు. మూవీ యూనిట్‌ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌ గా జరిగింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....