Parliament లో ఒవైసీ ప్రమాణ దూమారం !

హైదరాబాద్‌, జూన్‌ 25, (ఇయ్యాల తెలంగాణ) : పార్లమెంట్‌ లో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జూన్‌ 24న సోమవారం నాడు కొందరు ఎంపీలు లోక్‌సభలో ప్రమాణం చేశారు. నేడు సైతం ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రమాణ స్వీకారం దుమారం రేపింది. అసదుద్దీన్‌ ఒవైసీ హైదరాబాద్‌ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.  ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే అసదుద్దీన్‌ ఒవైసీ వివాదాస్పద పదాలు వాడారు. ప్రమాణం పూర్తి చేస్తూ చివర్లో జై భీమ్‌, జై విూమ్‌, జై తెలంగాణ, జై పాలస్తీనా అని అసదుద్దీన్‌ నినాదాలు చేశారు. అసదుద్దీన్‌ జై పాలస్తీనా అనడంపై అధికార పక్ష నేతలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరైనా వివాదాస్పద నినాదాలు చేస్తే వాటిని రికార్డ్స్‌ నుంచి తొలగిస్తారు. అసదుద్దీన్‌ వాడిన వివాదాస్పద పదాల్ని లోక్‌ సభ రికార్డ్స్‌ లో నుంచి తొలగించే అవకాశం ఉంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....