Parliament ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి భారీభద్రత !

న్యూ ఢిల్లీ, జూలై 04 (ఇయ్యాల తెలంగాణ) : పార్లమెంట్‌ లో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపు తున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రసంగంపై ఇప్పటికే పలువురు అభ్యంతరం చేశారు.ఈ క్రమంలోనే హిందూ సంస్థలతో సంబంధాలున్న వ్యక్తులు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ పై దాడి చేసే అవకాశం ఉందని ఢిల్లీపోలీసు నిఘా వర్గాలనుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో హోంమంత్రి త్వ శాఖ ఆదేశాల మేరకు ఢల్లీి పోలీసులు రాహుల్‌ గాంధీ, ఆయన ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాహుల్‌ నివాసం దగ్గర అదనంగా బలగాల ను మోహరించారు.అదే ప్రాంతంలో నివసిస్తున్న కాంగ్రెస్‌ నేతలపై కూడా నిఘా పెట్టారు. కాంగ్రెస్‌ అగ్రనేత లోకసభలో అధికార పక్షాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్‌ పై పలువురు సంస్థల నాయకులు దాడి చేసే అవకాశం ఉందని ఢల్లీి పోలీసులకు బుధవారం అర్థరాత్రి సమాచారం అందింది.రాహుల్‌ కు వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు వెలిసే ఛాన్స్‌ ఉందని తెలిపింది. దీంతో రాహుల్‌ ఇంటి వద్ద అదనంగా రెండు ప్లాటూన్ల బలగాలను మోహరించారు. ఒక్కో ప్లాటూన్‌ లో 16 నుంచి 18 మంది పోలీసులు ఉంటారు. అంతేకాదు తుగ్లక్‌ రోడ్డు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 8 నుంచి 20 మంది అదనపు పోలీసు లను మోహరించారు.న్యూఢిల్లీ సరిహద్దులను మూసివేసి క్షుణ్ణంగా చెక్‌ చేసిన తర్వాతే అనుమతి ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో పెట్రోలింగ్‌ ను కూడా పెంచారు. న్యూ ఢిల్లీజిల్లా డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ దేవేష్‌ మహాలా సోమవారం రాత్రి జిల్లాల్లోని అన్ని ఏసీపీలు, పోలీస్‌ స్టేషన్‌ ఇంచార్జీలకు భద్రతను పెంచాలని ఆదేశించారు.

హిందూ సంస్థలపై నిఘా పెట్టడమే కాదు..భవిష్యత్‌ వ్యూహాలను ఆరా తీయాల ని ఆదేశించినట్లు సమాచారం. రాహుల్‌ గాంధీ నివాసం దగ్గర , ఇతర ప్రాంతాల్లో పోస్టర్లు, బ్యానర్లు వేయ కుండా చూడాలని డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఆదేశించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....