హైదరాబాద్ జూలై 10 (ఇయ్యాల తెలంగాణ );: ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ వద్ద విూడియా ప్రతినిధుల పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనలను కవరేజ్ చేసేందుకు వెళ్లిన జీ తెలుగు రిపోర్టర్ పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారు. జీ తెలుగు రిపోర్టర్ చొక్కా పట్టుకుని లాక్కెళ్లారు. నేను జర్నలిస్టును.. విూ పని విూరు చేసుకోండి.. మా పని మేం చేసుకుంటాం అంటుంటే కూడా పోలీసులు వినిపించుకోలేదు. ఆ రిపోర్టర్‌ను బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి పోలీసులు తమ పైత్యాన్ని ప్రదర్శించారు.
