OSCAR AWARD విజేత సంగీత దర్శకుడు M M కీరవాణి గారికి ఘన సన్మాన కార్యక్రమం

 ఆగష్టు 21 (ఇయ్యాల తెలంగాణ );మెగా ప్రొడ్యూసర్‌ కె.టి కుంజుమోన్‌ జెంటిల్‌మన్‌ 2 సినిమా లాంచింగ్‌ ఈవెంట్‌, ఆస్కార్‌ విజేత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారికి సన్మాన కార్యక్రమం చెన్నైలోని ఎగ్మోర్‌లోని రాజా ముత్తయ్య హాల్‌లో గ్రాండ్‌ గా జరిగింది.సినీ పరిశ్రమకు చెందిన లీడిరగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌, నిర్మాతలు, ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకు అంగరంగ వైభవంగా జరిగింది. సమాచార, ప్రసార, మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ రాష్ట్ర మంత్రి ఎల్‌ మురుగన్‌,  గౌరవనీయులు జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ శ్రీ .టాగా మసయుకి, పీపుల్‌ ఆఫ్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషన్‌ డిప్యూటీ హెడ్‌ ఆఫ్‌ మిషన్‌ ఓఆ. అరిఫుర్‌ రెహమాన్‌, సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రెసిడెంట్‌ రవి కొట్టారా కారా, శ్రీమతి ఐరిన్‌ కుంజుమోన్‌ జ్యోతి ప్రజ్వలన చేసి జెంటిల్‌మన్‌ 2 చిత్రాన్ని గ్రాండ్‌ గా లాంచ్‌ చేశారు.అనంతరం ఆస్కార్‌ విజేత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారిని చిత్రబృందం, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఘనంగా సత్కరించారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....