OPERATION చిరుత….నాలుగో చిరుత కూడా దొరికింది

తిరుపతి ఆగష్టు 28 (ఇయ్యాల తెలంగాణ ):గత కొద్ది రోజులుగా భక్తులకు, అధికారులకు నిద్ర లేకుండ భయపెట్టిన  ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి నడక మార్గంలో  మరో చిరుతచిక్కింది. ఆదివారం  రాత్రి 7వ మైలురాయి వద్ద బోనులో పడిరది. ఈ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు పది రోజులుగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఎర వేయడంతో ఎట్టకేలకు చిరుత చిక్కింది. ఇప్పటివరకు 4 చిరుతలు చిక్కాయి. జూన్‌ నె 24 న, ఈ నెల 14, 17 న చిరుతలు బోనులో చిక్కాయి. దీంతో శేషాచలకొండలలో ఆపరేషన్‌ చిరుత ముగిసింది. ఇక నుంచి భక్తులు నడకమార్గంలో ప్రశాంతంగా వెళ్లేందుకు మార్గం సుగమమైంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....