Old City లో కార్డన్ అండ్ సెర్చ్

హైదరాబాద్ ఏప్రిల్ 10 (ఇయ్యాల తెలంగాణ) : చార్మినార్ జోన్ డీసీపీ, జోన్ అధికారులతో కలిసి భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డెన్ సెర్చ్ మరియు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్డెన్ సెర్చ్ మరియు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో చార్మినార్ జోన్ అధికారులు అందరూ పాల్గొన్నారు. కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ సమయంలో పోలీసులు నంబర్ ప్లేట్లు లేని 69 వాహనాలను స్వాధీనం చేసుకుని, గన్నా నసీర్తో సహా భవానీ నగర్కు చెందిన 6 మంది రౌడీ షెటార్లను అరెస్టు చేశారు. 

ఈ ఆపరేషన్లో భవానీ నగర్ పోలీసులు 11 మంది అనుమానిత రౌడీ షీటర్లను పట్టుకున్నారు. సోదాల సమయంలో పోలీసులకు పీడీఎస్ బియ్యం గోడౌన్ గురించి సమాచారం అందింది. వెంటనే వారు తలబ్కట్టా ప్రాంతంలో దాడులు చేసి, నిందితుల వద్ద నుండి 10 పీడీఎస్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, తలబ్కట్టాలోని అమన్ నగర్ నివాసి, 25 ఏళ్ల మహమ్మద్ హాజీ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....