గౌలిపురా, సెప్టెంబర్ 03 ( ఇయ్యాల తెలంగాణ) : పాతనగరంలో ఓటరు నమోదు ప్రక్రియకు రాజకీయ పార్టీల నుంచి సరైన తోడ్పాటు లభించక ఓటరు నమోదు ప్రక్రియలో అనుకున్న టార్గెట్ ను ఎన్నికల అధికారులు ముందుకు తీసుకెళ్లలేక పోతున్నారు. ఎంతసేపు ఓటరు నమోదు ప్రక్రియలో అధికారుల తప్పొప్పులను వెతికి పెట్టడమే పనిగా పెట్టుకోవడం తప్ప కొన్ని రాజకీయ పార్టీల పని తీరు కొత్త ఓటరు నమోదు ప్రక్రియకు సరైన సహకారం అందించడం లేదన్నది ప్రధాన విమర్శ! ఎన్నికల కమీషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఉన్న ఎన్నికల సంవత్సరం అత్యంత చాక చక్యంగా వ్యవహరించాల్సిన తరుణంలో ఓటరు నమోదు ప్రక్రియ అనుకున్నంత స్థాయిలో రీచ్ కాలేక పోతుంది.దీనికి తోడు ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాల ద్వారా ప్రతి పోలింగ్ స్టేషన్ లో బూత్ లెవెల్ అధికారులు ఓటరు నమోదును చేపడుతున్నారు. కానీ ఎల్లవేళలా ప్రజల్లో ఉండే రాజకీయ పార్టీల నాయకులు ఓటరు నమోదుకు ప్రజల్లో అవగాహన కల్పించలేక పోతున్నారు. అధికారులు అవగాహన కల్పించాలన్న వారికి సరైన తోడ్పాటు అందడం లేదు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనేది ఎన్నికల కమీషన్ లక్ష్యం. కానీ ఓటర్ల నమోదు ప్రక్రియలో బి ఎల్ ఓ లకు సరైన తోడ్పాటు లభించడం లేదు. ప్రతి వారం అధికారులు నిర్వహిస్తున్న రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం కేవలం విమర్శలకు మాత్రమే అన్నట్లుగా కొనసాగుతుంది తప్ప ఓటరు నమొదుకు ప్రజల్లో అవగాహన కల్పించలేక పోతున్నారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటిటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నప్పటికీ కొందరు ఓటర్లు బి ఎల్ ఓ లను మీకేం పని లేదా ? అని నిలదీస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వెళ్లిన వివరాలు చెప్పడం లేదని బి ఎల్ ఓ లు వాపోతున్నారు. ప్రధానంగా హిందూ ఓటర్లు అత్యంత ఎక్కువగా నివసించే ప్రాంతాల్లోనే ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే అతిశయోక్తి కలుగక మానదు. ఇక్కడ రాజకీయ ప్రతినిధులు కేవలం మీటింగుల్లో అధికారులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు తప్ప అవగాహనకు ముందుకు రావడం లేదు. కనీసం ఎన్నికలు సమీపిస్తున్న ఈతరుణంలో నైనా విమర్శలకు పోకుండా ప్రజలకు ఓటరు నమోదు ప్రక్రియలో సరైన అవగాహన కలగాలన్నది అందరి ఉద్దేశం.
- Homepage
- Charminar Zone
- Old City లో ఓటరు నమోదు ప్రక్రియకు నాయకుల సహకారం కరువు !
Old City లో ఓటరు నమోదు ప్రక్రియకు నాయకుల సహకారం కరువు !
Leave a Comment
Related Post