Old Cityలో భవిష్యవాణితో మొదలైన సామూహిక ఘటాల ఊరేగింపు జాతర !

 

హైదరాబాద్, జూలై 29 (ఇయ్యాల తెలంగాణ) : ఆషాడ మాసంలో అత్యంత వైభవంగా నిర్వహించే తెలంగాణ బోనాల జాతర వేడుకలు ఆదివారం ఘనంగా ముగిసాయి. సోమవారం ఘటాల ఊరేగింపు సందర్భంగా అనురాధ  భవిష్య వాణితో సామూహిక ఘటాల ఊరేగింపు జాతర మొదలైంది. నా భక్తులందరిని చల్లంగా కాపాడుకుంటానని భవిష్యవాణి విన్పించింది.అమ్మవారి ఆలయానికి స్థలాన్ని పెంచాలని, లేని పోనీ రోగాలు మీరే తెచ్చుకున్నా నేనే కాపాడు కుంటున్నానని అన్నింటిని పారద్రోలుతున్నాన్నని భవిష్యవాణి వినిపించింది. భవిష్యవాణి తో ప్రస్తుతం పాతబస్తీలో బోనాల ఘటాల ఊరేగింపు జాతర మొదలైంది. గంటల ఊరేగింపు నయాపూల్ వరకు కొనసాగుతుంది. ఇప్పటికే వేలాది సంఖ్యలో భక్తులు ఘటాల ఊరేగింపు జాతరలో పాల్గొన్నారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....