NTRపేర రూ.100 స్మారక నాణేన్ని విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపదీముర్ము

న్యూఢల్లీ ఆగష్టు 29 (ఇయ్యాల తెలంగాణ ); ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము విడుదల చేశారు. న్యూఢల్లీిలోని రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, నటుడు బాలకృష్ణ, ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌తో పనిచేసిన సన్నిహతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్‌ ముర్ము మాట్లాడుతూ.. భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీర్‌ ఎంతో ప్రత్యేకమన్నారు. కృష్ణుడు, రాముడి వంటి పాత్రల్లో ఆయన నటన అద్భుతమని, ప్రజల్లో చెరగని ముద్ర వేశారని చెప్పారు. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్‌ తన ప్రత్యేకత చాటుకున్నారని తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారని వెల్లడిరచారు. ఎన్టీఆర్‌ విలక్షణ వ్యక్తిత్వాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని చెప్పారు.హైదరాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లో తయారైన ఈ స్మారక నాణెం.. 44 మిల్లీవిూటర్ల చుట్టుకొలతతో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్‌, 5 శాతం జింక్‌ కలిపి ఉంటుంది. ఓ వైపు ఎన్టీఆర్‌ బొమ్మ ఉంటే మరోవైపు మూడు సింహాల బొమ్మ ఉంటుంది. ఎన్టీఆర్‌ శత జయంతి అని హిందీలో రాసి దాని కింద 1923`2023 అని రాసుంటుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....