విశేష ప్రజాదరణ పొందిన ప్రజానాయకుడు భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి. ఆయన డిసెంబర్ 25,1924 న గ్వాలియర్ లోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజపేయి. అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన మొదటి నాయకుడు. ఈయన బ్రహ్మచారి. ఇతను మొదటిసారిగా రెండవ లోక్‌సభ కు ఎన్నికైనారు. మధ్యలో 3వ మరియు 9వ లోక్‌సభలకు తప్పించి 14వ లోక్ సభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికైనారు. 1968 నుండి 1973 వరకు జనసంఫ్‌ు పార్టీ కి అధ్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. 1996 లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998 లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించారు. 1999 లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, సర్వ శిక్షా అభియాన్ వంటి ముఖ్యమైన సంస్కరణలు ఆయన హయాంలో అమలు చేయబడ్డాయి. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో కలిసి చారిత్రక దార్శనిక పత్రంపై పనిచేయడం ద్వారా, ఆయన అమెరికాతో సంబంధాలను మెరుగుపరిచారు. హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలని ఆర్‌ఎస్‌ఎస్ ఒత్తిడి చేస్తున్నప్పటికీ, వాజ్‌పేయి సంకీర్ణ పాలనపై దృష్టి సారించారు.
తన పదవీకాలంలోనే భారత్ పోఖ్రాన్ అణు పరీక్షలను చేపట్టింది. 1999 కార్గిల్ యుద్ధంలో కూడా ఆయన తన దేశాన్ని విజయపథంలో నడిపించారు. ఢల్లీి`లాహోర్ బస్సు సర్వీసును ప్రారంభించడం మరియు లాహోర్ డిక్లరేషన్‌పై సంతకం చేయడంతో పాటు, ఆయన పాకిస్తాన్‌తో శాంతి కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994 లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. మొదటి కాంగ్రేసేతర ప్రభుత్వమైన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించారు. ఆయన అనారోగ్య కారణాలవళ్ళ క్రియాశీల రాజకీయాలనుండి తప్పుకున్నారు. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గానూ భారత ప్రభుత్వం డిసెంబర్ 24, 2014 లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. ఆయన పుట్టినరోజు అయిన డిసెంబర్ 25 ను సుపరిపాలనా దినం గా భారత ప్రభుత్వం ప్రకటించింది. వాజ్‌పేయీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల విూదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ మార్చి 27 2015 న ప్రదానం చేశారు. అనారోగ్యంతో పూర్తిగా మంచంపై ఉన్న వాజ్‌పేయీకి భారత రత్న ప్రదానం చేయడానికి స్వయంగా రాష్ట్రపతే వాజ్‌పేయీ నివాసానికి తరలి వచ్చారు.ఈయన 93 సంవత్సరాల వయస్సులో ఆగస్టు 16, 2018 న తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో మృతి చెందారు. వాజ్‌పేయి ఒక వివేకవంతమైన రాజకీయ నాయకుడిగా, నిస్వార్థ సామాజిక కార్యకర్తగా, శక్తివంతమైన వక్తగా, కవిగా మరియు సాహిత్యకారుడిగా ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు.