
హైదరాబాద్ , సెప్టెంబర్ 22 (ఇయ్యాల తెలంగాణ) : బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో, ఈ నెల 23 సాయంత్రం 3:00 గంటలకు, భాగ్యనగరంలోని భాగ్య లక్ష్మీ అమ్మ వారి దేవాలయం వద్ద బతుకమ్మ వేడుకలు జరుపుతున్నట్లు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రాంచందర్ రావు ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలం లో బతుకమ్మ సంబరాలకు సంబంధించిన పోస్టర్ ను రాంచందర్ రావు గారి చేతుల విూదుగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతంరావు , ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి , ఎమ్మెల్సీ అంజిరెడ్డి , బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి , బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డా. మేకల శిల్పారెడ్డి ,, సునీతా రెడ్డి,, రాష్ట్ర మహిళా మోర్చ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
