National అవార్డు అందుకున్న బలగం’ Movie

న్యూ డిల్లీ సెప్టెంబర్‌ 23 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టిన బలగం సినిమా మరోసారి సత్తా చాటింది. ఈ సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ అనే పాటకు ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్‌ జాతీయ అవార్డు అందుకున్నారు. మంగళవారం ఢల్లీిలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల విూదుగా ఆయన ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. తెలంగాణ సంస్కృతి, కుటుంబ బంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్‌ వద్ద కూడా విజయం సాధించింది. ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....