‘మటన్‌ సూప్‌’ Title పోస్టర్‌ విడుదల

రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్‌, శ్రీ వారాహి ఆర్ట్స్‌, భవిష్య విహార్‌ చిత్రాలు (ఃపఅ) బ్యానర్లపై రామచంద్ర వట్టికూటి తెరకెక్కిస్తున్న ‘మటన్‌ సూప్‌’ టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు

రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్‌, శ్రీ వారాహి ఆర్ట్స్‌, భవిష్య విహార్‌ చిత్రాలు (ఃపఅ) బ్యానర్లపై రమణ్‌, వర్షా విశ్వనాథ్‌ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మటన్‌ సూప్‌’. ‘విట్‌నెస్‌ ది రియల్‌ క్రైమ్‌’ ట్యాగ్‌ లైన్‌. మల్లిఖార్జున ఎలికా (గోపాల్‌), అరుణ్‌ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మాతలుగా రానున్న ఈ నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు విడుదల చేశారు.

ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా ఆగస్ట్‌ 15న ఈ నూతన సినిమాకు సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీనియర్‌ నిర్మాత కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ.. ‘పర్వతనేని రాంబాబు సారథ్యంలో అలుక్కా స్టూడియోస్‌, శ్రీ వారాహి ఆర్ట్స్‌, భవిష్య విహార్‌ చిత్రాలు (ఃపఅ) బ్యానర్లపై రామచంద్ర వట్టికూటి దర్వకత్వంలో రాబోతోన్న చిత్రం ‘మటన్‌ సూప్‌’. టైటిల్‌ పోస్టర్‌ బాగుంది. చిత్రయూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌. సినిమా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

చిత్ర నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్‌) మాట్లాడుతూ.. ‘మా ‘మటన్‌ సూప్‌’ టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేసిన లెజెండరీ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు గారికి ధన్యవాదాలు. మా టీం అందరికీ ఆయన ఆల్‌ ది బెస్ట్‌ తెలిపారు. త్వరలోనే మేం ఆడియెన్స్‌ ముందుకు రాబోతోన్నాం. మంచి చిత్రంతో రాబోతోన్న మా అందరినీ ఆడియెన్స్‌ ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

హీరో రమణ్‌ మాట్లాడుతూ.. ‘నా ఫ్రెండ్‌ రామచంద్ర మంచి కథతో ‘మటన్‌ సూప్‌’ తెరకెక్కిస్తున్నారు. మా టైటిల్‌ పోస్టర్‌, మోషన్‌ పోస్టర్‌ అద్భుతంగా వచ్చింది. మా కోసం వచ్చి సపోర్ట్‌ చేసిన నిర్మాత కె.ఎస్‌.రామారావు గారికి థాంక్స్‌. సినిమా అద్భుతంగా వస్తోంది. పగలు రాత్రి అన్న తేడా లేకుండా మేం అంతా కష్టపడుతున్నాం. మేం తీస్తున్న ఈ మంచి చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

చిత్ర దర్శకుడు రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ.. ‘రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్‌, శ్రీ వారాహి ఆర్ట్స్‌, భవిష్య విహార్‌ చిత్రాలు (ఃపఅ) బ్యానర్లపై పర్వతనేని రాంబాబు గారి సారథ్యంలో నేను తెరకెక్కిస్తున్న చిత్రం ‘మటన సూప్‌’. మా మూవీ టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసిన నిర్మాత కేఎస్‌ రామారావు గారికి ధన్యవాదాలు’ అని అన్నారు.

నిర్మాత రామకృష్ణ సనపల మాట్లాడుతూ ‘రియల్‌ ఇన్సిడెంట్స్‌ ఆధారంగా చేసుకుని మటన్‌ సూప్‌ సినిమాను రూపొందించాం. త్వరలోనే విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నాం. మా సినిమా టైటిల్‌ పోస్టర్‌ విడుదల చేసిన నిర్మాత కె.ఎస్‌.రామారావుగారికి ధన్యవాదాలు’ అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....