ముంబైలో కుండపోత

ముంబై, ఆగస్టు 18, (ఇయ్యాల తెలంగాణ) : ఆర్థిక రాజధాని ముంబైని సోమవారం భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వానలతో నగర జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాల ప్రభావం విమాన రాకపోకలపై తీవ్రంగా పడిరది. ప్రతికూల వాతావరణం, వెలుతురు సరిగా లేకపోవడంతో ముంబై విమానాశ్రయంలో దిగాల్సిన తొమ్మిది విమానాలు ల్యాండిరగ్‌ను రద్దు చేసుకుని గాల్లోనే చక్కర్లు కొట్టాయి (గో`అరౌండ్‌). మరో విమానాన్ని అధికారులు వేరే నగరానికి మళ్లించారు.ఈ పరిణామాల నేపథ్యంలో ఇండిగో, ఆకాశ ఎయిర్‌ వంటి విమానయాన సంస్థలు ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేశాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో విమానాశ్రయానికి చేరుకోవడానికి అదనపు సమయం కేటాయించు కోవాలని  కోరాయి. ప్రయాణానికి ముందు తమ విమాన స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో సరిచూసుకోవాలని కూడా సూచించాయి.

వర్షాల కారణంగా నగరంలోని అనేక ప్రధాన రహదారులు నీటమునిగాయి. వెస్టర్న్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే, అంధేరి సబ్‌వే, లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌ వంటి ప్రాంతాలు జలమయ మయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలు నెమ్మదించి, భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడ్డాయి. అటు హార్బర్‌ లైన్‌లో లోకల్‌ రైళ్లు కూడా 15 నుంచి 20 నిమిషాల ఆలస్యంగా నడిచాయి.భారీ వర్షాల దృష్ట్యా బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) ముందుజాగ్రత్త చర్యగా నగరంలోని పాఠశాలలు, కళాశాలలకు సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి హాఫ్‌ డే సెలవు ప్రకటించింది. మరోవైపు, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబై, థానే ప్రాంతాలకు ఆగస్టు 19 వరకు ‘ఆరెంజ్‌ అలర్ట్‌’ జారీ చేసింది. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో దహిసార్‌లో 188 మి.విూ., శాంతాక్రూజ్‌లో 85 మి.విూ. చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....