
1000 చెల్లిస్తే మున్సిపాలిటీ లైసెన్స్
మహబూబాబాద్, ఆగష్టు 16 (ఇయ్యాల తెలంగాణ) : పంచభూతాలలో ఒకటైన నీరు సృష్టి ప్రారంభమైన దగ్గర నుండి శ్వాస ద్వారా జీవనం సాగిస్తున్న క్రిమి, కీటక, జంతు, మానవ ప్రాణులకు నీటితోనే జీవనం. రివర్స్ పంపింగ్ వాటర్ (ఆర్వో)సహజంగా దొరికే నీరు కాకుండా , డ్రిల్లింగ్ ద్వారా భూమి క్రింద భాగం నుండి రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని పైకి తీసుకువచ్చి మిషనరీ సహాయంతో శుద్ధి చేసే ప్రక్రియలో భాగంగా 1 లీటర్ పనికోచ్చే నీరు అమ్మకానికి వినియోగించాలంటే , లీటర్ నీరు వృధా చేస్తూ అందులో శుద్ధి పేరుతో నీటిలోని బ్యాక్టీ రియా, లవణాలను తొలగిస్తూ, నీరు రుచి కొరకు రసాయన పదార్థాలను కలపడంతో శుద్ధి చేసిన నీటిలో కాల్షియం, మెగ్నీషియం, సోడియం, సల్ఫర్, ఫాస్ఫరస్ వంటి లవణాలు తొలగించడంతో శుద్ధి చేసిన నీరు మినరల్ వాటర్ అంటూ ఇంటి ముందుకు రాగానే డబ్బులు చెల్లించి మరి నీటిని కొనుగోలు చేసి తాగితే రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గి, రోగ నిరోధక శక్తి తగ్గడం, ఎముకల బలహీనత రావడం, శుద్ధి చేసిన నీటిలో సోడియం పొటాషియం ఖనిజాల లోపం ఉండడంతో హెబ్రోనైటినియా వికారం వాంతులు తలనొప్పి అలసట మలబద్ధకం ఒత్తిడి జీవక్రియ సరిగ్గా పనిచేయక పోవడం వంటి సమస్యలు, డబ్బులు చెల్లించి రసాయనాలు కలిపిన మినరల్ వాటర్ కొనుగోలు చేసి తాగడం వలన, అద్భుతంగా సమతుల్యంగా పనిచేసే శరీరం లో (మినరల్స్) లోపం వలన మనిషి శరీరంలో శుద్ధి చేసే ప్రక్రియ తగ్గడంతో నోటి ద్వారా తీసుకున్న నీటిలో కెమికల్స్ రసాయనాలు ఉండడం వలన లివర్ పనితీరు తగ్గడంతో, శరీరంలో వ్యర్ధాలు, రక్తంలో ఉన్న వ్యర్ధాలు గడ్డకట్టి , కిడ్నీలో రాళ్లు గా ఏర్పడుతూ , ఆకలిని తగ్గిస్తూ, మల బద్ధకాన్ని పెంచుతూ, యూరిన్‌లో ఇన్ఫెక్షన్, కీళ్ల మధ్య జిగురు తయారు చేసే చర్యను తగ్గిస్తూ, చర్మం కాంతివంతంగా ఉండే గుణాన్ని కోల్పోవడం జరుగుతుంది.
నియమాలా ?
మన నిత్య జీవితంలో అవసరానికి తగిన విధంగా ప్లాస్టిక్ డబ్బాలలో మినరల్ ఆర్వో మినరల్ నీటిని కొనుగోలు చేసి తాగుతూ ఉంటాం, కొనుగోలు చేసి మినరల్ వాటర్ తాగడం తప్పేవిూ కాదు, కానీ ఆ నీటిలో నిజంగా మినరల్స్ ఉన్నాయా ? కొనుగోలు చేసి తాగే (ఆర్వో) మినరల్ నీరు పంపిణీ చేస్తున్న మినరల్ ప్లాంట్ యజమానులు సరైన పద్ధతిలో శుద్ధికి సంబంధించిన నియమ, నిబంధనలతో కావలసిన లైసెన్స్, నీటి పరీక్ష , రసాయనాలు ఎంత మోతాదులో కలపాలో సూచించే మిషనరీ సామాగ్రి, వాటర్ ప్లాంట్ మెయింటెనెన్స్, లైసెన్స్, శుభ్రత నియమ నిబంధనలు పాటిస్తున్నారా ? లేదా ? అనే విషయాలను చూసుకొని పూర్తిస్థాయిలో మినరల్స్ అందిస్తున్న ఆల్కలైన్ మినరల్ వాటర్ తాగడానికి వినియోగించు కుంటే చక్కటి ఆరోగ్యం. మానవుల శరీరం దృఢంగా ఆరోగ్యంగా ఉండాలంటే భూమిపైన సహజంగా దొరికే నీరు మట్టి ద్వారా ప్రవాహం ఉన్నందున నీటిలో క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సల్ఫర్ , క్లోరైడ్, లెడ్, జింక్ వంటి సహజ ఖనిజ లవణాలు నీటిలో కలిసి ఉన్నందున మానవులు ఆ నీటిని త్రాగితే శరీరానికి కావలసిన పోషకాలు లభించడంతో శరీరంలోనీ ఎముకలు దృఢత్వం చెందుతూ, చర్మం కాంతి వంతంగా మారుతుంది, సహజ ఇమ్యూనిటీ పెరుగుదలకు ఉపయోగ కరంగా ఉండడంతో మానవులు ఆరోగ్యంగా జీవిస్తారు.
మినరల్స్ తో కూడిన మినరల్ వాటర్ ఆరోగ్యానికి మంచిదే !
మినరల్స్ తో కూడిన ఆల్కలైన్ వాటర్ బాటిల్ ధర ఎక్కువగా ఉంటుంది కనుక సామాన్యులు అంత డబ్బు చెల్లించలేరు. శ్రీమంతులకు మాత్రమే మినరల్స్ తో ఉన్న మినరల్ వాటర్ కొనుగోలు చేసే ధరలోనే ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీ, లివర్ సమస్యలతో ఉన్న వారి జీర్ణ వ్యవస్థ , శరీరానికి అవసరమైన మినరల్స్ శరీరం ఉత్పత్తి చేసుకో లేనందున, ఆల్కలైన్ మినరల్స్ ఉన్న వాటర్ కొనుగోలు చేసినా నీరూ తీసుకున్నట్లయితే ఆరోగ్య సమస్య తో ఉన్న వీరి శరీరానికి అవసరమైన మినరల్స్ అందుతాయు.మినరల్ వాటర్ పరీక్ష పరికరాలు ఆన్లైన్ అమెజాన్ ఇతర యాప్‌లలో కూడా టి డి ఎస్ విూటర్, పి హెచ్ లిక్విడ్, ఓ ఆర్ లిక్విడ్, కొనుగోలు ద్వారా మినరల్ వాటర్ (టెస్ట్) పరీక్ష చేసుకోవచ్చు .ప్లాస్టిక్ డబ్బాలలో వాటర్ ? మినరల్ (ఆర్వో ) నీరు అని ఏమాత్రం ఆలోచించకుండా కొనుక్కొని ఆ నీటిని తాగుతుండడంతో శరీరానికి కావలసిన లవణాలు లేకపోవడంతో ఇమ్యూనిటీ తగ్గుతూ, శరీరంలో నీరు రక్తంలో చిక్కదనం గా ఉండడంతో గుండె పనితీరు పైన అధిక ఒత్తిడి కలిగి మరణానికి కారణమైన ఆశ్చర్య పోవాల్సిన అవసరం ఉండదు ?ప్రకృతిలో దొరికే సహజ వనరులుపూర్వీకుల నుండి వినియోగిస్తున్న మట్టి కుండా, రాగి బింద లో సహజంగా దొరికే చెరువు నీరు, మున్సిపాలిటీ వాటర్ నిటిని కాచి వేడి చేసుకుని కుండ, బింద లలో పోసుకుని తాగినట్లయితే శరీరానికి కావలసిన లవణాలు అంది, శరీరం లోని సెల్స్ ఆరోగ్యవంతంగా ఉండడం వలన, చక్కటి తేజస్సు, జుట్టు పెరగడం, శరీర దృఢత్వం, మోకాళ్ళ చిప్పలలో జిగురు వంటి పదార్థం కాల్షియం సరిపడా ఉండడంతో ఎముకల దృఢత్వం, రోగ నిరోధక శక్తి వ్యవస్థ పటిష్టం అవుతుంది. వైద్యం వైపు చూడకుండా ఆరోగ్యం మెరుగుపడుతుంది.
శుద్ధి చేసిన వాటర్ అవసరం
ఐరన్ ఇనుము యంత్రాలు , ఎలక్ట్రానికల్ వంటి వాటికి మాత్రమే శుద్ధి చేసిన నీరు కావాలి. మానవుల శరీరం కూడా ఒక అద్భుతమైన సహజ కృత్రిమ యంత్రం లాంటిది . ఆరోగ్యంగా ఉన్న యంత్రాన్ని, పోషక పదార్థాలతో కూడిన ఆహారం, సహజ మైన నీరు మాత్రమే వినియోగిస్తూ ఆరోగ్యమే మహాభాగ్యంగా జీవిద్దాం.