MEDI STAR హాస్పటల్ స్మార్ట్ హెల్త్ కార్డు

 అనేక రకాల చికిత్సలకు  రాయితీలు అందిస్తున్న ఎం.డి డా.ఎస్.వెంకటేశ్వర్లు

హైదరాబాద్, ఫిబ్రవరి  02 (ఇయ్యాల తెలంగాణ) : పేద, మధ్యతరగతి  ప్రజల కోసం అమీర్ పేట్ లోని మేడి స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ సరి కొత్త వినూత్న అవకాశాన్ని ప్రవేశ పెట్టింది. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్బంగా ఆసుపత్రికి వచ్చే నిరుపేద కుటంబాలకు చెందిన పేషంట్స్ సౌకర్యార్థం వినూత్న అవకాశాన్ని కల్పించింది. జనవరి 26 న హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ పుట్టిన రోజు కూడా తోడు కావడంతో అదేరోజు ఈ అవకాశాన్ని ఆసుపత్రికి వచ్చే పేద, మధ్య తరగతి కుటుంబాలకు అవసరానికి అండగా ఉండేలా ఈ పథకాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు (బిఏ,ఎల్ఎల్ బి, బిఏఎంఎస్) చేతుల మీదుగా ఒక స్మార్ట్ హెల్త్ కార్డు ను ఆవిష్కరించారు. ఇందులో కేవలం 100 రూపాయలతో వివిధ రకాల జబ్బులతో ఆసుపత్రికి వచ్చే రోగుల కోసం డాక్టర్ ను సంప్రదించే అవకాశం అదేవిధంగా  ల్యాబ్ ఇన్వెస్ట్మెంట్ లో 20 శాతం రాయితీ, ఐ పి బిల్లుల పై 20 శాతం రాయితీ ప్రకటించారు. దీంతో పాటు అన్ని రకాల మందుల కొనుగోలుపై కూడా 10 నుంచి 20 శాతం వరకు రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు. వివిధ రకాల జబ్బులతో ఆసుపత్రికి వచ్చే  రోగుల సౌకర్యార్థం ఇలాంటి రాయితీలు అందించడం పట్ల అనేక మంది రోగుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆసుపత్రిలో కూడా రోగులకు ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నా దగ్గరుండి ఏంతో శ్రద్దగా హాస్పిటల్ ఎండి దగ్గరుండి పరిశీలిస్తూ ఉంటారు. ఇలాంటి ఒకానొక పరిస్థితుల్లో పాతబస్తీ నుంచి చికిత్స కోసం వచ్చిన  కిరణ్ కుమార్ అనే పేషెంట్ కు ఎంతో ప్రమాదకర  ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు డాక్టర్లు అందరు కలిసి ఎండి సూచనల మేరకు ట్రీట్మెంట్ చేయడం జరిగినది. నేడు  అతను ఆరోగ్యంగా ఇంటికి రావడం పట్ల అతని కుటుంబ సభ్యులు అత్యంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  మేడి స్టార్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ వారు ఎంతో ప్రేమ అభిమానాలతో  ప్రతి విషయంలో మాతో సంప్రదింపులు చేస్తూ ట్రీట్మెంట్ చేసినారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాబట్టి  వివిధ ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే ఇతర ప్రజలు కూడా ఈ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడం ద్వారా ఏంతో మేలు జరుగుతుందని ఏదైనా హెల్త్ సమస్య ఉంటే మేడి స్టార్  హాస్పటల్ లో చేరితే పేషెంట్ కు ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చే అవకాశాలు అత్యథికంగా ఉన్నాయని చార్మినార్ ప్రాంతానికి  చెందిన గడ్డం సత్యనారాయణ కోరారు. చికిత్స కోసం ఆసుపత్రికి సంబందించిన వివిధ బ్రాంచ్ లను సంప్రదించవచ్చని కోరారు. అమీర్ పెట్ లోని మైత్రి వనం పిల్లర్ నంబర్ 10 42 లేదా హాస్పిటల్ ఫోన్ నంబర్లు 9666667367,8790072495 సంప్రదించవచ్చని సూచించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....