హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో 2027 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. మే 11వ తేదీ నుంచి ఈ ప్రక్రియ షురూ కానుంది. జూన్ 9, 2026 వరకు పూర్తిగా డిజిటల్ విధానంలో జరగనుంది. ఈ తరహా డిజిటల్ లెక్కింపు విధానం? దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.2011 వరకు మాన్యూవల్ (కాగితాలపై) విధానం ద్వారా జనాభా లెక్కింపు కొనసాగింది. అయితే ఈసారి అందుకు భిన్నంగా 2027 జనాభా లెక్కలను డిజిటల్ విధానంలో నిర్వహిస్తామని తెలంగాణ జనాభా లెక్కల కార్యకలాపాల డైరెక్టర్ భారతి హోలికేరి గురువారం తెలిపారు.మొదటి దశ ప్రక్రియ మే 11 నుండి జూన్ 9 వరకు జరుగుతుందని ఆమె ప్రకటించారు. రెండవ దశ ఫిబ్రవరి 2027 లో జరుగుతుందని తెలిపారు. తెలంగాణల జరిగే ఈ జనాభా లెక్కింపులో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లతో సహా 88,000 మంది సిబ్బంది పాల్గొంటారని ప్రకటించారు. సుమారు 93,000 నుంచి 94,000 మంది ఉద్యోగులు శిక్షణ పొందుతున్నారని వివరించారు.“మునుపటి జనాభా గణనలతో పోలిస్తే ఇది చాలా ప్రత్యేకతను కలిగి ఉంది. మొదటిసారిగా డిజిటల్ మోడ్ లో లెక్కించబోతున్నాము. 2011 జనాభా లెక్కల వరకు గణనలు కాగితం ఆధారితంగా ఉండేవి. సెన్సస్ మేనేజ్ మెంట్ మానిటరింగ్ సిస్టమ్ (సీఎంఎంఎస్), సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్, హెచ్ ఎల్ వో యాప్ వంటి వివిధ డిజిటల్ సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి ఇంటి నుంచి డేటాను సంగ్రహించడానికి ఎన్యూమరేటర్లు ఉంటారు” అని భారతి హోలికేరి తెలిపారు.డిజిటల్ విధానంలో సేకరించబోయే డేటా అత్యంత సురక్షింతగా ఉండనుంది. డేటా అప్లోడ్ అయిన వెంటనే?. అది ఎన్యూమరేటర్ల పరికరాల నుంచి సెంట్రల్ సర్వర్లలోకి వెళ్లిపోతుంది. ఎలాంటి అనుమానాలకు అవకాశం ఉండదని భారతి హోలికేరి స్పష్టం చేశారు.
జనాభా గణనలో భాగంగా నిర్వహించబోయే కులగణనపై కూడా భారతి హోలికేరీ స్పందించారు. మొదటి దశలో ఇంటి పెద్ద (ఎస్సీ, ఎస్టీ, ఇతరులు) పేరు, కులం సేకరిస్తామన్నారు. రెండవ దశలో ఇతర సభ్యుల కుల వివరాలను సేకరిస్తామని తెలిపారు.జనాభా లెక్కల సమయంలో అడగాల్సిన ప్రశ్నల సంఖ్యపై ఆమె మాట్లాడుతూ?. మొదటి దశ షెడ్యూల్ ను కేంద్రం ఇప్పటికే నోటిఫై చేసిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఏకరీతిగా ఉన్న 33 ప్రశ్నలు అడుగుతామని ఆమె చెప్పారు.ఏప్రిల్ 16 నుంచి మే 10 వరకు తెలంగాణ ప్రజలకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ అందుబాటులో ఉంటుంది. పోర్టల్ చాలా యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ టూల్. ఇంటి సందర్శన సమయంలో పోర్టల్ లో పూర్తి చేసిన డేటాను ఎన్యూమరేటర్ లు ధ?వీకరిస్తారు. పౌరుల కోసం హెల్ప్ లైన్ అందుబాటులోకి వస్తుంది.మొదటి దశ జనాభా గణన 2026 మే 11న ప్రారంభమై జూన్ 9 వరకు కొనసాగుతుంది. రెండో దశ 2027 ఫిబ్రవరిలో జరుగుతుంది.ప్రజలు తమకు తాముగా నిర్ణీత పోర్టల్లో కుటుంబ వివరాలను నమోదు చేసుకోవడాన్ని సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటారు. ఇది ఏప్రిల్ 16 నుంచి మే 10 వరకు అందుబాటులో ఉంటుంది.కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మొత్తం 33 రకాల ప్రశ్నలను ఎన్యూమరేటర్లు అడుగుతారు. ఇవి దేశవ్యాప్తంగా అందరికీ ఒకేలా ఉంటాయి.అవును. మొదటి దశలో ఇంటి పెద్ద కుల వివరాలను, రెండో దశలో కుటుంబ సభ్యులందరి కుల వివరాలను సేకరిస్తారు.
