ఒంగోలు, మార్చి 26 (ఇయ్యాల తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో ఈ ఉదయం అత్యంత దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్, ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టడంతో ఘోరం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో మొత్తం 13 మంది ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోయి సజీవ దహనమయ్యారు. ఈ ఘటన అందర్నీగ్భ్భాంతికి గురి చేసింది.
హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్ నిర్మల్ నుంచి వింజమూరుకు వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. చీమకుర్తి నుంచి కంకర లోడుతో వస్తున్న టిప్పర్, రాయవరం వద్ద బస్సును బలంగా ఢీ కొట్టింది. ఈ క్రమంలోనే టిప్పర్ డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలు తక్షణమై బస్‌కు అంటుకున్నాయి. క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైందని మార్కాపురం డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. ప్రమాదం వెనుక సాంకేతిక లోపాలు కూడా ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. బస్ కండిషన్ సరిగా లేదని ప్రయాణికులు మొదట్లోనే ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సిబ్బంది యర్రగొండు పాలెం వద్ద గంటసేపు ఆపేసి రిపేర్ చేశారు. అనంతరం ప్రయాణం కొనసాగించారు. ఇది జరిగిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. బస్ సిబ్బందిని విచారించగా స్టీరింగ్ స్టక్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుమారు 28 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం వివిధ ఆసుపత్రులకు తరలించారు. వారిలో సుమారు ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మంటల తీవ్రత ఎక్కువగా ఉన్నందున బస్ పూర్తిగా కాలిబూడిదైంది. మతదేహాలను వెలికితీసే క్రమంలో దశ్యాలు అత్యంత దారుణంగా ఉన్నాయని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. మతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో మతుల కుటుంబ సభ్యుల డీఎనఏ ఆధారంగా వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మతి చెందిన వారంతా కనిగిరి, పామూరు ప్రాంతాలకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.
బాధితుల కోసం అత్యవసర సహాయం
ప్రమాదంలో చిక్కుకున్న వారి వివరాలను తెలుసుకునేందుకు, సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు ప్రభుత్వం తక్షణమే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. 6304285613, 9985733999, 7989537285, 9703578434ఫోన్ నెంబర్ల ద్వారా సమాచారం పొందవచ్చని అధికారులు సూచించారు. ఈ ఘోర ప్రమాదంపై ప్రదానమంత్రి నరేంద్ర మోదీగ్భ్భాంతి వ్యక్తం చేశారు. మతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహయా నిధి నుంచి రెండు లక్షల రూపాయలు చొప్పున, గాయపడిన వారికి 50 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై జిల్లా యంత్రాంతో ఫోన్లో మాట్లాడి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. ప్రమద కారణాలపై తక్షణమే దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని పోలీసులను కోరారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్ వెనుక భాగంలో ఉన్న వారు మంటల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినా డ్రైవర్ పోరిపోవడంతో అది సాధ్యం కాలేదని చెబుతున్నారు. సహాయం కోసం ఎమర్జెన్సీ నెంబర్లకు ఎన్నిసార్లు కాల్ చేసినా ఎవరూ స్పందించలేదని, రెస్క్యూ టీం సకాలంలో వచ్చి ఉంటే ప్రాణ నష్టం తగ్గేదని బాధితులు చెబుతున్నారు.
అసలేం జరిగిందంటే
ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సవిÖపంలో పలక క్వారీల వద్ద ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్ , టిప్పర్ ఎదురెదురుగా ఢీ కొన్న ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. బస్ పూర్తిగా కాలిపోయింది. మార్కాపురం జిల్లా మార్కాపురం గ్రావిÖణ మండల పరిధిలోని రాయవరం సవిÖపంలో ఈ దుర్ఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు హరికష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్ ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్‌లో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లాలోని కనిగిరి వైపు వెళ్తున్న టైంలో ఈ ప్రమాదం రాయవరం వద్ద జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం బస్, టిప్పర్ అతివేగంగా ఎదురెదురుగా ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో టిప్పర్ డీజిల్ ట్యాంక్ పగలడంతో మంటలు చెలరేగాయి. సెకన్లలో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. లోపల ఉన్న ప్రయాణికులు సీట్ల నుంచి లేచి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. బస్ నిమిషాల్లోనే పూర్తిగా కాలిపోయింది. చాలా మంది ప్రయాణికులు నిద్రమత్తులో ఉండటంతో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటలు చుట్టుముట్టాయి. కొందరు సాహసించి బస్ కిటికీలు పగులుగొట్టి ప్రాణాలతో బయటపడగా, లోపల చిక్కుకున్న 16మంది సజీవదహనం అయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే బస్ పూర్తిగా అస్తిపంజరంలా మారిపోయింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొందరు ప్రయాణికులను పోలీసులు మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, దీని వల్ల మతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయవరం సవిÖపంలోనీ ఈ ప్రాంతంలో క్వారీలకు ప్రసిద్ధి. ఇక్కడ భారీగా టిప్పర్ల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా తెల్లవారుజామున అతి వేగం, డ్రైవర్ల అజాగ్రత్త ప్రమాదాలకు కారణమమవుతుంటాయి. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులకు అవసరమైన వైద్య సహాం అందించడంతోపాటు మతుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశారు. మార్కాపురం రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ద్రిగ్భ్భాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికుల మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. క్షతగాత్రులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది. అక్కడ ఏం జరిగిందో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పారు. మార్కాపురం ప్రమాద ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్గ్భ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులు, స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడారు. ప్రమాద వివరాలను మంత్రి గొట్టిపాటికి అధికారులు వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. మతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హావిÖ ఇచ్చారు.
