MARCH 22న పుష్ప 2


హైదరాబాద్‌, ఆగస్టు 25, (ఇయ్యాల తెలంగాణ );ఇండియన్‌ మోస్ట్‌ అవైటెడ్‌ పాన్‌ ఇండియన్‌ ప్రాజెక్ట్స్‌ లో ‘పుష్ప` ది రూల్‌’  ఒకటి. అల్లు అర్జున్‌ ` సుకుమార్‌ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్‌ లో అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప` ది రైజ్‌’ పాన్‌ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో దాన్ని మించేలా ‘పుష్ప` ది రూల్‌’ ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘పుష్ప’ మూవీ సత్తా చాటింది. ఇందులో అద్భుత నటన కనబర్చిన అల్లు అర్జున్‌, ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నారు. ఏ తెలుగు హీరోకు సాధ్యం కాని ఘనతను సాధించారు. ఈ మూవీకి చక్కటి మ్యూజిక్‌ అందించిన దేవిశ్రీ ప్రసాద్‌ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప2’పై కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు నెలకొన్నాయిఇక తాజాగా ‘పుష్ప` ది రూల్‌’ సినిమా విడుదల తేదీపై మేకర్స్‌ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది(2024) మార్చి 22న రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసినట్లు టాక్‌ నడుస్తోంది. ‘పుష్ప’ సినిమాతో పోల్చితే ‘పుష్ప2’ కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్‌ అవుతుందని మేకర్స్‌ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 75 శాతం కంప్లీట్‌ అయినట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు ఇప్పటికే షూట్‌ చేశారట. చాలా వరకు వైజాగ్‌ లో ఈ సినిమాను షూట్‌ చేశారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తిచేసి త్వరలోనే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను కూడా ప్రారంభించాలని మేకర్‌ సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఈ ఏడాది చివర్లోనే సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్‌ ఆలస్యం అవుతుందట. దీంతో వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.  మైత్రి మూవీ మేకర్స్‌ సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌ గా నటిస్తుండగా.. అనసూయ, సునీల్‌ లతో పాటూ సీనియర్‌ నటుడు జగపతిబాబు మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాక్‌ స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ‘పుష్ప’ పార్ట్‌ 1 కి వరల్డ్‌ వైడ్‌ గా భారీ రెస్పాన్స్‌ రావడంతో మేకర్స్‌ ‘పుష్ప 2’ను ఇండియా వ్యాప్తంగానే కాకుండా చైనా, జపాన్‌, రష్యా వంటి ఇతర దేశాల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....