మందకృష్ణ మాదిగ సభను జయప్రదం చేయండి !

దేవనకొండ , ఫిబ్రవరి 10 (ఇయ్యాల తెలంగాణ) : కౌతాళం మండలం, హాల్వి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ శుక్రవారం విచ్చేయుచున్న సందర్భంగా కరపత్రాలును బుధవారం మండల కేంద్రమైన దేవనకొండ లో ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు సుభాష్ చంద్ర మాదిగ,యం ఆర్ పి  ఎస్, దేవనకొండ మండలం ఇంచార్జ్  కె చిన్న సంజన్మ మాదిగ, ఆదేశాల మేరకు కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం యం ఆర్ పి ఎస్ దేవనకొండ మండల అధ్యక్షులు మాచాపురం ఈరన్న మాదిగ, ఎం ఎస్ పి మండల అధ్యక్షుడు కోటకొండ పెద్దయ్యా మాదిగ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలు మరువలేనివని వారు గుర్తు చేశారు. అదేవిధంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత మందా కష్ణ మాదిగ తీసుకున్న తర్వాత కర్నూలు జిల్లాకు రావడం మొట్టమొదటిసారి అని మండలంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల, జిల్లా నాయకత్వం,మండలా నాయకత్వం, గ్రామస్థాయిలో ప్రతి గ్రామం నుండి అత్యధిక సంఖ్యలో పాల్గొనీ ఆయనకు మండల నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చి ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట నరసింహులు మాదిగ, పల్లె దొడ్డి కిష్టన్న మాదిగ, రంగస్వామి మాదిగ, రాజు మాదిగ, ఐస్వామి మాదిగ, శ్రీనివాసులు మాదిగ, గిడ్డయ్యా మాదిగ, బళ్లారి శీనన్న మాదిగ, దుబ్బన్న మాదిగ, పరమేష్ మాదిగ, తదితరులు ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....